OTTలోకి వచ్చేసిన స్పైడర్ విలన్ రొమాంటిక్ థ్రిల్లర్... ఎక్కడ చూడాలో తెలుసా?
ఓటీటీ వచ్చాక ప్రతి వారం కొత్త సినిమాలు సందడి చేస్తూనే ఉంటాయి. ఇక ఈ శుక్ర ఆహా తమిళ్ ఓటీటీ వేదికగా ఓ ప్రేమకథా చిత్రం స్ట్రీమింగ్ కు వచ్చింది. స్పైడర్ మూవీలో విలన్ గా నటించిన ప్రేమిస్తే భరత్ నటించిన కొత్త చిత్రం లవ్. మలయాళంలో విజయవంతమైన లవ్ సినిమా ఆధారంగా అదే పేరుతో ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేశారు. ఇది ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఆ వివరాల్లోకి వెళితే....
హీరో భరత్... అప్పట్లో ప్రేమిస్తే సినిమా తీసి సంచలనం సృష్టించారు. ఇక ఈ సినిమా చిన్న మూవీగా విడుదల అయి.. బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమాతో తెలుగు మార్కెట్ లో కూడా ఆయనకు క్రేజ్ ఏర్పడింది. ఇక వరుస సినిమాలు చేశారు. కానీ స్టార్ హీరో కాలేకపోయారు.

ఇక తెలుగులో మహేశ్ బాబు నటించి స్పైడర్ సినిమాలో విలన్ గా కనిపించారు. ఎస్ జే సూర్య తమ్ముడిగా బైరవ క్యారెక్టర్ లో భరత్ నటన అద్భతం అనిపించారు. ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ ఆయన చాలా రోజుల తర్వాత సుదీర్ బాబుతో కలిసి హంట్ సినిమాలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.
ఇక చాలా రోజుల తర్వాత ప్రేమిస్తే భరత్ ఓ తమిళ చిత్రంలో నటించారు. ఆయన నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ లవ్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా వాణి భోజన్ నటించింది. ఈ సినిమాకు ఆర్‌పీ బాలా దర్శకత్వం వహించాడు. మలయాళంలో విజయవంతమైన లవ్ సినిమా ఆధారంగా అదే పేరుతో ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేశారు.
మలయాళంలో కమర్షియల్ హిట్‌గా నిలిచిన లవ్ సినిమా తమిళ ప్రేక్షకుల్ని మాత్రం నిరాశపరిచింది. భరత్ హీరోగా నటించిన 50వ సినిమాగా ఈ చిత్రం రిలీజైంది. అతడి యాక్టింగ్ బాగున్నా కాన్సెప్ట్ రొటీన్ కావడంతో బాక్సాఫీస్ వద్ద ఆడలేదు. ఇందులో అజయ్‌గా భరత్, దివ్యగా వాణి భోజన్ నటించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అజయ్, దివ్య మధ్య గొడవలు జరుగుతాయి.
ఇక ఈ సినిమాలో భరత్ చేసే చిన్న కారణంగా దివ్య చనిపోతుంది. ఆ తర్వాత ఆ హీరో జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనే కథాంశంతో లవ్ సినిమా తెరకెక్కింది మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ను ఎంగేజింగ్‌గా స్క్రీన్ పై ఆవిష్కరించడంలో దర్శకుడు తడబడ్డాడు. ఇక ఈ మూవీని మీరు ఓటీటీలో ఓసారి చూసేయొచ్చు.


Click it and Unblock the Notifications











