Spirit OTT: స్పిరిట్ ఓటీటీ రైట్స్‌కు కళ్లు చెదిరే ధర... ప్రభాస్ మూవీకి రిలీజ్‌కు ముందే ఎన్ని కోట్ల లాభమంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సెన్షేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అదే స్పిరిట్. ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తోన్న ఈ సినిమాను ఇటీవల న్యూఇయర్ సందర్భంగా అధికారికంగా ప్రకటించారు సందీప్. ప్రభాస్, తృప్తి దిమ్రీలతో ఉన్న ఆ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబోపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగినట్లుగానే ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా స్పిరిటీ ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వడంతో పాటు దానికి కళ్లు చెదిరే ధర వచ్చినట్లుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పిరిటీ ఓటీటీ డీల్ ఎంత? ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఏ సంస్థ సొంతం చేసుకుంది? ఈ వివరాల్లోకి వెళితే..
స్పిరిట్ కాస్ట్ అండ్ క్రూ
భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్సన్, టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగాలు స్పిరిట్ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన తృప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, అలనాటి నటి కాంచనలు కీలకపాత్ర పోషిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా... రాజ్ తోట సినిమాటోగ్రాఫర్‌గా, సుప్రీం సుందర్ యాక్షన్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 2027 మార్చి 5న స్పిరిట్ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, జపనీస్, కొరియన్, మాండ్రిన్ భాషల్లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.

స్పిరిట్‌లో చిరంజీవి?
స్పిరిట్ మూవీపై హైప్ మరింత పెంచేలా సోషల్ మీడియాలో రకరకాల కథనాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ కీలకపాత్ర పోషించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఓ 15 నిమిషాల పాటు చిరంజీవి కనిపిస్తారని ఫిలింనగర్ టాక్. సోషల్ మీడియా టాక్ ప్రకారం ప్రభాస్‌కు తండ్రిగా చిరు నటిస్తారని అంటున్నారు. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఈ మూవీపై హైప్ మరింత పెరిగిపోతుందనడంలో అతిశయోక్తి లేదు.
స్పిరిట్ విలన్ ఎవరు?
ఇక స్పిరిట్‌లో విలన్ ఎవరన్న దానిపైనా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ టాప్ స్టార్ ఒకరు ఈ సినిమాలో ప్రతినాయక పాత్ర పోషిస్తారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదని.. ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్, మ్యాచో స్టార్ గోపీచంద్ ఈ మూవీలో విలన్ పాత్ర పోషించనున్నారని వార్తలు వచ్చాయి. దీనికి తగినట్లుగానే సందీప్ రెడ్డితో గోపీచంద్ ఓ ఫోటో దిగడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. గతంలో వర్షం మూవీలో ప్రభాస్‌కు గోపీచంద్ విలన్‌గా నటించడం.. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ కావడం తెలిసిందే.
స్పిరిట్ ఓటీటీ రైట్స్ ఆ కంపెనీ చేతికి
కాగా.. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతూ ఉండటంతో దానికి తగినట్లుగానే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం ఇప్పటి నుంచే పోటీ మొదలైనట్లుగా తెలుస్తోంది. సెట్స్ మీదకు వెళ్లకుండానే స్పిరిట్ మూవీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కుల కోసం బడా సంస్థలు ఫ్యాన్సీ రేట్ ఆఫర్ చేస్తున్నాయట. అయితే నిర్మాతలు మాత్రం ఆచితూచి స్పందిస్తున్నట్లుగా టాక్. కానీ డిజిటిల రైట్స్‌ను మాత్రం అమ్మినట్లుగా చిత్ర పరిశ్రమలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీని ప్రకారం తెలుగు సహా అన్ని భాషలకు చెందిన స్పిరిట్ డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ డీల్ ఎంత? అనే ఫిగర్ మాత్రం బయటకు రాలేదు. సోషల్ మీడియా టాక్ ప్రకారం దీని వాల్యూ 200 నుంచి 250 కోట్ల రేంజ్‌లో ఉంటుందని అంచనా. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











