Squid Game season 2 : ఓటీటీలలో కొరియన్ సిరీస్ కొత్త చరిత్ర.. నెగిటివ్ టాక్‌తోనే విధ్వంసం
ప్రపంచవ్యాప్తంగా ఇపుడు ఓటీటీల ప్రభావం ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లో థియేటర్స్ ఎంత రివొల్యూషన్ తీసుకొచ్చాయో ఇపుడు వాటికి పోటీ అన్నట్టుగా ఈ కొత్త ఓటీటీలు ఆల్టర్నెట్‌గా వచ్చేసాయి. ఒక్క థియేటర్స్‌కి మాత్రమే కాకుండా టెలివిజన్ ఛానెల్స్ కూడా ఈ ఓటీటీల మూలాన దెబ్బ తింటున్నాయి.
ఈ నేపథ్యంలో సీరియల్స్‌కి ప్రత్నామ్యాయంగా పలు వెబ్ సిరీస్‌లు సినిమాల రేంజ్‌లో ట్రీట్ ఇస్తుండటంతో ఓటీటీలలో వాటికి ఆదరణ మరింత పెరుగుతూ వచ్చింది. ఇలా సాలిడ్ ఎంటర్టైన్మెంట్‌ని ప్రామిస్ చేస్తున్న టాప్ మోస్ట్ సంస్థల్లో నెట్ ఫ్లిక్స్ గురించి తెలియని వారు ఖచ్చితంగా ఎవరూ ఉండరు. ఇదే నెట్ ఫ్లిక్స్‌లో ఒక్క బయట దేశాల్లోనే కాకుండా ఓవరాల్ వరల్డ్ వైడ్‌గా కూడా భారీ క్రేజ్ సొంతం చేసుకున్న సిరీస్‌లు ఉన్నాయి.

అయితే గ్లోబల్ ఆడియెన్స్‌కి ఎంతగానో రీచ్ అయ్యిన సెన్సేషనల్ సిరీస్‌లలో మొదటి స్థానంలో "మనీ హేస్ట్" ఉండేది. స్పానిష్‌కి చెందిన ఈ సిరీస్ ఇంగ్లీష్‌లో డబ్బింగ్ అయ్యి భారీ రెస్పాన్స్‌ని రికార్డు వ్యూస్‌తో అందుకుంటే ఈ రికార్డులని కేవలం మొదటి రోజులోనే ఇంకో సిరీస్ బ్రేక్ చేసి నెట్ ఫ్లిక్స్ లోనే కాకుండా మొత్తం ఓటిటి లలోనే కొత్త ట్రెండ్ సృష్టించింది. మరి ఆ సిరీస్‌నే కొరియన్ భాషకి చెందిన ప్రముఖ సిరీస్ "స్క్విడ్ గేమ్".
కరోనా సమయంలో కొరియన్ కంటెంట్‌కి, మలయాళ కంటెంట్‌కి ఒక్కసారిగా భారీ ఎత్తున ఆదరణ పెరిగింది. ఇలా కొరియన్ కంటెంట్ అంటే మినిమమ్ అనేలా ఫాలోయింగ్ స్టార్ట్ అయ్యింది. అప్పుడు వచ్చిన స్క్విడ్ గేమ్ మొదటి సీజన్ కేవలం ఒక్కరోజులోనే హైయెస్ట్ రికార్డ్స్ సాధించి పెట్టింది. దీనికి కొనసాగింపుగా రీసెంట్‌గానే సీజన్ 2ని నెట్ ఫ్లిక్స్ వారు తీసుకొచ్చారు. అయితే మొదటి సీజన్ అంత పెద్ద హిట్ అయ్యినపుడు సీజన్ 2కి కూడా క్రేజ్ మామూలుగా ఉండదు కదా. అలాగే స్క్విడ్ గేమ్ 2కి కూడా సంచలన రెస్పాన్స్ నమోదు చేసింది.
ఇలా సీజన్ 2 ఏకంగా 92 దేశాల్లో ఏకధాటిగా గత ఐదు రోజులు నుంచి నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతుంది. అంతే కాకుండా మొదటి వారంలోనే అత్యదిక వ్యూస్ అందుకున్న సిరీస్‌గా కొత్త చరిత్ర సెట్ చేసింది అని అఫీషియల్‌గా నెట్ ఫ్లిక్స్ వాళ్లే చెబుతున్నారు. అలాగే నాన్ ఇంగ్లీష్ జాబితాలో అయితే ఇప్పటి వరకు వచ్చిన నెట్ ఫ్లిక్స్ టీవీ షోస్‌లో ఆల్ టైం టాప్ 7 లోకి జస్ట్ ఈ కొన్ని రోజుల్లోనే వచ్చేసింది.
దీనితో ఈ సిరీస్‌కి రెస్పాన్స్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కాగా మొత్తం 7 ఎపిసోడ్స్‌గా వచ్చిన సీజన్ కేవలం ఈ 5 రోజుల్లోనే 68 మిలియన్లకు పైగా వ్యూస్‌ని అందుకుందట. ఇలా నెట్ ఫ్లిక్స్‌లో సంచలన రికార్డులను స్క్విడ్ గేమ్ 2 తెచ్చుకుంది. ఇదంతా చాలా ప్లాప్ అండ్ మిక్స్డ్ టాక్‌తోనే సొంతం చేసుకోవడం గమనార్హం.
ఇక ఇవన్నీ పక్కన పెడితే సీజన్ 3 ఎప్ప్పుడు? ఏంటి? అనే రూమర్స్ కూడా మొదలయ్యాయి. అయితే దీనిపై సీజన్ 1కి సీజన్ 2కి ఉన్నంత గ్యాప్‌ని తీసుకోకుండా ఈ 2025 లోనే వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. ప్రస్తుతం ఉన్న టాక్ ప్రకారం ఐతే ఇది ఈ ఏడాది మొదట్లోనే రావచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ సీజన్ 2కి చాలా మంది పర్ఫెక్ట్ ఎండింగ్ కోసం చూస్తున్నారు. మరి అది సీజన్ 3లో అయినా దక్కుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











