OTTలోకి వచ్చేసిన మోస్ట్ పాపులర్ గేమ్ సిరీస్... ఎందులో చూడాలంటే?
ఓటీటీలలో కొత్త వెబ్ సిరీసులు, సినిమాలు వస్తునే ఉంటాయి. అయితే అందులో ఆకట్టుకునేవి కొన్ని మాత్రమే. ఇక ఓటీటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సీరిస్ ల్లో ఒకటి స్క్విడ్ గేమ్. ఇప్పుడు ఈ సిరిస్ కు సెకండ్ సీజన్ వచ్చేసింది. స్క్విడ్ గేమ్ ది ఛాలెంజ్ పేరిట ఈ సీజన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈసారి ఏ కథతో రాబోతుంది.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఓటీటీ ప్రేక్షకుల కోసం.. కొత్త కంటెంట్ ను తీసుకురావడంలో ఓటీటీ సంస్థలు ముందంజలో ఉంటున్నాయి. ఇక వెబ్ సిరీస్ లు చూసేవారికి పరిచయం అక్కర్లేని లేని సిరీస్ స్క్విడ్ గేమ్ సీరిస్. ఓటీటీల్లో వెబ్ సిరీసులు చూసే వారికి ఈ వెబ్ సిరీస్ గురించి తెలిసే ఉంటుంది. బాగా పాపులర్ సిరిసులు 'గేమ్ ఆఫ్ థ్రోన్స్', 'మనీ హెయిస్ట్', స్ట్రేంజర్ థింగ్స్, బ్రేకింగ్ బ్యాడ్ వంటి వెబ్ సిరీసులను కూడా ఈ స్క్విడ్ గేమ్ వెనక్కి నెట్టి వ్యూస్ పరంగా నంబర్ 1 స్థానం కైవసం చేసుకుంది.

స్క్విడ్ గేమ్ సిరీస్ 2021 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది. కరోనా కాలంలో ఈ సీరిస్ ను బాగా చూశారు ప్రేక్షకులు. ఇక ఈ వెబ్ సిరీస్ చాలా పెద్ద హిట్ గా నిలిచింది. రిలీజ్ అయిన కేవలం 28 రోజుల్లో ఈ సిరీస్‌ను ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల మంది నెట్ ఫ్లిక్స్ యూజర్లు చూశారంటే దీని క్రేజ్ ఎలా ఉందో చెప్పనక్కర లేదు.. సిరీస్ లో వయొలెన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయింది. దీనికి భారీ ఎత్తున క్రేజ్ ఏర్పడింది.
ఇక మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ గా పేరుతెచ్చుకున్న స్క్విడ్ గేమ్ కు... సీక్వెల్ గా 'స్క్విడ్ గేమ్: ది ఛాలెంజ్' రెడీ అయింది. ఇప్పటికే సెకండ్ సీజన్ కు సంబంధించి ఫస్ట్ లుక్ తో పాటు ట్రైలర్ లు రిలీజ్ చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సెకండ్ సీజన్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్క్విడ్ గేమ్: ది ఛాలెంజ్ అందుబాలోకి వచ్చేసింది. ఈ సీరిస్ గత రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక స్క్విడ్ గేమ్ సెకండ్ సీజన్‌లో $4.56 మిలియన్ల ప్రైజ్ మనీ కోసం 456 మంది రియల్ పీపుల్ పోటీ పడుతున్నట్లు సమాచారం. ఇక మొదటి సీజన్ లో కనిపించిన లీ జంగ్ జే, లీ బ్యుంగ్ హున్, వి హా జున్, గాంగ్ యూ రెండో సీజన్‌లో కూడా నటించారు. వీరితో పాటు యిం సి వాన్, కాంగ్ హా న్యూల్, పార్క్ సంగ్ హూన్, యాంగ్ డాంగ్ గ్యూన్ స్క్విడ్ గేమ్ నటుల్లో కొత్తగా చేరారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. స్క్విడ్ గేమ్ సీజన్ 1 నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. కేవలం 28 రోజుల్లోనే 1.65 బిలియన్ గంటల వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంది ఈ సీరిస్. అంతేకాదు పలు అవార్డులను కూడా స్క్విడ్ గేమ్ కైవసం చేసుకుంది. ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డుల్లో 14 నామినేషన్లను పొందింది ఈ సీరిస్. అంతే కాదు ఆరు అవార్డులను గెలుచుకుంది.


Click it and Unblock the Notifications











