బట్టలు కూడా పంపకుండా శివని ఏడిపిస్తున్నారు.. మిత్రా ప్లానే అంతా.. పీఆర్ గుట్టురట్టు చేసిన స్రవంతి

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే ఆరు వారాలు విజయవంతంగా పూర్తిగా కేవలం ఐదుగురు కంటెస్టెంట్ లు మాత్రమే ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్లారు. అయితే తాజాగా ఆదివారం నాడు డబల్ ఎలిమినేషన్ జరగగా ముమైత్ ఖాన్ తో పాటు స్రవంతి కూడా ఎలిమినేట్ అయింది.. ఎలిమినేట్ అయిన తర్వాత స్రవంతి బయటకు వచ్చి లోపల కంటెస్టెంట్ ల గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి. గత సీజన్లలో ఎన్నడు బయటపెట్టని విధంగా స్రవంతి అనేక విషయాలు బయట పెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే

ఆసక్తికర వ్యాఖ్యలు

ఆసక్తికర వ్యాఖ్యలు

నిజానికి బిగ్ బాస్ కంటెస్టెంట్ లు హౌస్ లోపల ఉంటారు కాబట్టి వాళ్ళు ఫోన్ వాడే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ల తరఫున వాళ్ళ కుటుంబ సభ్యులు స్నేహితులు లేదా ఒక పీఆర్ టీమ్ పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళ పని ఏమిటి అంటే లోపల ఉన్న వారి కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఓట్లు వేయమని కోరడం. అలాగే ఎప్పటికప్పుడు వారి ఫోటోలు అప్డేట్ చేస్తూ ప్రేక్షకులలో తమతమ కంటెస్టెంట్ ల మీద మరింత అభిమానం పెంచేలా చేయడం. ఇప్పుడు ఆ పిఆర్ వ్యవహారం గురించి స్రవంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

బట్టలు పంపించొద్దు అని

బట్టలు పంపించొద్దు అని


హౌస్ లోపల ఉన్న యాంకర్ శివ నిర్మాతగా మారిన హీరోయిన్ మిత్రశర్మ ఇద్దరికీ ఒకరే పిఆర్ గా ఉంటున్నారని వెల్లడించారు. బాలు అనే వ్యక్తి ఈ ఇద్దరి కోసం పని చేస్తున్నాడని ఆమె చెప్పుకొచ్చింది. ముందు నుంచి శివ మిత్ర ఇద్దరూ బాగా స్నేహంగా ఉండేవాళ్ళు అని కానీ ఒకానొక సందర్భంలో వారిద్దరి మధ్య గొడవ జరగడంతో మిత్ర కెమెరా దగ్గరకు వెళ్లి శివ అన్న బట్టలు పంపించొద్దు అని చెప్పిందని చెప్పుకొచ్చింది.

హెల్ప్ చేయమని

హెల్ప్ చేయమని


అప్పటినుంచి శివ ఎన్నిసార్లు బట్టల పంపించాలని కోరినా సరైన బట్టలు పంపించడం లేదని ఆమె చెప్పుకొచ్చింది. దానికి కారణం శివ బాలు మధ్య స్నేహం రెండేళ్లయితే మిత్ర -బాలు మధ్య స్నేహం ఎనిమిదేళ్లు అని ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేం కాబట్టి నేను బయటకు వచ్చేటప్పుడు శివ తనకు బయటనుంచి హెల్ప్ చేయమని కొంచెం చూసుకోమని చెప్పాడని స్రవంతి చెప్పుకొచ్చింది.

క్లోజ్‌గా ఉండేవారని

క్లోజ్‌గా ఉండేవారని


శివ-మిత్ర చాలా క్లోజ్‌గా ఉండేవారని పేర్కొన్న ఆమె అసలు శివని మిత్రా ఎందుకు నామినేట్ చేసిందో ఇప్పటికీ అర్ధం కాదని చెప్పుకొచ్చింది. శివ మిత్రని చాలా బాగా చూసుకునేవాడని ఆమె చెప్పుకొచ్చింది. ఆమె అలిగినప్పుడు కేవలం శివ అన్నంపెడితేనే తినేది.. ఎవరు పెట్టినా తినేది కాదని ఆమె పేర్కొంది. మొదటి రెండు వారాలు శివ అన్నయ్యా మీరే చేయాలి.. మీరే తినిపించాలి అనేది.

 హాట్ టాపిక్ గా

హాట్ టాపిక్ గా


సడెన్‌గా మూడో వారంలో శివ, చైతులను నామినేట్ చేసేసరికి మాకు ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయని స్రవంతి చెప్పుకోచింది. ఆమెను ఎంత ఓదార్చి,ఎంత బాగా చూసుకున్నా.. వీకెండ్ వచ్చేసరికి నాగార్జున ముందు ఎవరూ చూడటం లేదు అని చెప్పేదని ఆమె చెప్పుకొచ్చింది. ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X