Alluri: 15 రోజులకే ఓటీటీ రిలీజ్.. శ్రీ విష్ణు సినిమా ఎందులో వచ్చిందంటే!
సినీ బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల రంగంలోకి ఎంట్రీ ఇచ్చి.. కెరీర్ ఆరంభంలోనే సపోర్టింగ్ రోల్స్‌తో ప్రేక్షకులను మెప్పించి.. ఆ తర్వాత హీరోగా మారి సత్తా చాటుతున్నాడు యంగ్ హీరో శ్రీ విష్ణు. వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ.. విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తనకంటూ ప్రత్యేమైన ఇమేజ్‌ను ఏర్పరచుకున్నాడు. అంతేకాదు, సహజ సిద్ధమైన నటనతో ప్రతి సినిమానూ వన్ మ్యాన్ షోగా మార్చేస్తున్నాడు. అదే సమయంలో హిట్లు ఫ్లానులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. అదే సమయంలో కొత్త దర్శకులను సైతం పరిచయం చేస్తూనే వస్తున్నాడు.
వరుస ఫ్లాపులతో సతమతం అవుతోన్న శ్రీ విష్ణు ఇటీవలే 'అల్లూరి' అనే సినిమాలో నటించాడు. ప్రదీప్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రావడంతో దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. కానీ, మొదటి రోజే థియేటర్ల ఇష్యూ కారణంగా ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాలేదు. ఇక, ఎట్టకేలకు ఆరోజు మధ్యాహ్నం నుంచి ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఆరంభంలోనే దీనికి నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడిపోయి.. చాలా తక్కువగానే వచ్చాయి.

థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేకపోయిన శ్రీ విష్ణు 'అల్లూరి' మూవీని అనుకున్న సమయానికి కంటే ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను విడుదలైన కేవలం 15 రోజులకే అంటే అక్టోబర్ 7వ తేదీ నుంచే ఆహా సంస్థలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. థియేటర్లలో చాలా తక్కువ రోజులు మాత్రమే ప్రదర్శితం అయిన ఈ సినిమా.. ఓటీటీలో మాత్రం మంచి ఆదరణను సొంతం చేసుకుంటున్నట్లు తెలిసింది.
శ్రీ విష్ణు హీరోగా ప్రదీప్ వర్మ తెరకెక్కించిన చిత్రమే 'అల్లూరి'. కాయాదు లోహార్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను బెక్కం వేణు గోపాల్ నిర్మించారు. ఇందులో తణికెళ్ల భరణి, మధుసూదన్ రావు, ప్రమోదిని, రవి వర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రమేశ్వర్ సంగీతాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











