OTTలోకి అన్ లిమిటెడ్ కామెడీ మూవీ... ఎందులో చూడాలంటే?
ఇప్పటికే ఓటీటీలో రెండు కామెడీ చిత్రాలు సందడి చేస్తున్నాయి. అవే అభినవ్ గోమఠం నటింటిన మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా, వైవా హర్ష సుందరం మాస్టార్ సినిమాలు. ఈ రెండు ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ సినిమాలకు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వేస్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ రెండు సినిమాలకు మించి.. అన్ లిమిటెడ్ ఎంటర్టైనర్ రాబోతుంది. ఆ సినిమా ఏంటి.. దాని కథేంటి.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.
సినీ ప్రియులకు మండే ఎండకాలంలో ఓటీటీ సంస్థలు కూల్ కూల్ సినిమాలు తీసుకువస్తున్నాయి. ఇప్పటికే ఓటీటీలో క్రైమ్, హారర్, థ్రిల్లర్, సస్పెన్స్ సినిమాలతో పాటు.. కామెడీ సినిమాలు సందడి చేస్తున్నాయి. అయితే ఇప్పటికే వైవా హర్ష సుందరం మాస్టర్, అభినవ్ గోమఠం మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా కామెడీ సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. ఇప్పుడు దానికి మించిన కడుపుబ్బా నవ్వుకునే.. అన్ లిమిటెడ్ కామెడీ మూవీ ఓం భీమ్ బుష్ రాబోతుంది.

హీరో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. ఈ సినిమా ఇటీవల థియేటర్లకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రాగా.. నెల కాకముందే ఇప్పుడు ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయింది. ఈ సినిమాకు మంచి వసూళ్లు కూడా వస్తున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది.
ఓం భీమ్ బుష్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా వసూళ్లు అందుకుంది. దాదాపు రెండున్నర గంటలపాటు ప్రేక్షకులకు ఆన్ లిమిటెడ్ కామెడీని అందించి ఎంటర్టైన్ చేయడంలో మూవీ మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఈ సినిమాకు శ్రీహార్ష దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా థియేటర్లో ఉండగానే... ఓటీటీ విడుదల తేదీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అనుకున్నదానికంటే ముందే అంటే విడుదలైన నెల రోజుల లోపే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు సమాచారం.

ఓం భీం బుష్ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ డిజిటల్ ప్రైమ్ వీడియో డిజిటల్ ప్రిమియర్ హక్కులను దక్కించుకుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19 నుంచే అందుబాటులోకి తీసుకురానున్నారని సమాచారం. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే... శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఫ్రెండ్స్. వీరు ముగ్గురు భైరవ పురం అనే ఊరుకు వెళ్తారు. అక్కడ డబ్బులు సంపాదించుకోవడం కోసం సైంటిస్టులుగా కొత్త అవతారం ఎత్తుతారు. దీంతో వీరి గురించి తెలుసుకోవడానికి ఆ ఊరి ప్రజలు సంపంగి మహల్ లో ఉన్న నిధిని కనిపెట్టాలని పరీక్ష పెడుతారు. అయితే సంపంగి మహాల్ కి వెళ్లిన వీరికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే విషాయలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











