20 రోజుల్లోనే OTTలోకి వచ్చేస్తున్న ఓం భీమ్ బుష్.. అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ఇదే!
సినీ ప్రియులు అందరినీ కడుపుబ్బా నవ్వించాలనే ఉద్దేశంతో తెరకెక్కించిన సినిమానే ఓం భీమ్ బుష్. అన్ లిమిటెడ్ కామెడీతో వచ్చి అందరినీ తెగ ఎంటర్ టైన్ చేసిన ఈ సినిమాలో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. మార్చి 22వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ముఖ్యంగా ఈ సినిమా ఎప్పటి నుంచి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో అధికారికంగా ప్రకటించేశారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కామెడీ జోనర్ లో వచ్చిన ఈ సినిమాను యువీ క్రియేషన్స్, వి సెల్యూలాయిడ్స్ సంయుక్తంగా నిర్మించారు. ముఖ్యంగా ఈ సినిమాలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలతో పాటు ప్రీతి ముకుందన్, ఆయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, రచ్చ రవి, ఆదిత్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ సూపర్ హిట్ సినిమాకు సన్నీ ఎం ఆర్ సంగీతం అందించగా.. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు నిర్వహించారు. అలాగే విజయ్ వర్ధన్ ఎడిటర్ గా పని చేశారు.

అదిరిపోయే కామెడీ కాన్సెప్టుతో వచ్చి సూపర్ హిట్ కొట్టిన ఈ సినిమాకు మొదటి నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా బాగుండడం.. ఎక్కువ సాగదీయకుండా షార్ట్ టైంలోనే అసలు విషయాలు చెప్పి అందరినీ నవ్వించడాన్ని సినీ ప్రియులు తెగ ఎంజాయ్ చేశారు. కేవలం 2.15 నిమిషాలకే సినిమా రన్ టైమ్ ను ఫిక్స్ అవగా... అంటే కేవలం ఈ సినిమా 135 నిమిషాలు మాత్రమే ఈ చిత్రం ఉండగా.. ఆద్యంతం ఆకట్టుకుంది. షార్ట్ అండ్ స్వీట్ గా ఉండడంతో ఈ సినిమాను ఎక్కువ మంది ఇష్టపడ్డారు. అలా అందరి నుంచి ప్రశంసలు పొందిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతుంది.
భీమ్ బుష్ సినిమాపై మొదటి నుంచి పెద్ద ఎత్తునే అంచనాలు ఉండడంతో ఈ మూవీ డిజిటల్ హక్కుక కొనుగోలు విషయంలో పెద్ద ఎత్తున పోటీ పడ్డాయి పలు సంస్థలు. అయితే అందరినీ వెనక్కి నెట్టి ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసింది. సినిమా విడుదల అయ్యాక నాలుగు వారాలా తర్వాత ఓటీటీలోకి తీసుకు వస్తామని కూడా ఒప్పందం చేసుకున్నారట. కానీ అనుకున్నదాని కంటే ముందుగానే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.

తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ.. ఎక్స్ వేదికగా ఓం భీమ్ బుష్ సినిమా అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించింది. ఏప్రిల్ 12వ తేదీ అంటే ఈ శుక్రవారం నుంచే ఈ సినిమా అందుబాటులోకి రాబోతున్నట్లు చెప్పింది. కేవలం మూడు వారాలకే ఈ సినిమా ఓటీటీలోకి వస్తుండడంతో అంతా ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. ఈ సినిమాను కచ్చితంగా ఈ వీకెండ్ లో చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











