OTT ఆహాలో రికార్డు సృష్టించిన సామజవరగమన.. 72 గంటల్లో ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయంటే?

టాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న చిత్రంగా రిలీజై భారీ విజయాన్ని అందుకొన్న చిత్రం సామజవరగమన. ఈ చిత్రం విడుదలైన తొలి రోజు తొలి ఆట నుంచి పాజిటివ్ రెస్పాన్స్, మౌత్ టాక్‌తో దూసుకెళ్లింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొన్నది. థియేటర్‌లో ఓ మాదిరి కలెక్షన్లు సాధిస్తున్న సమయంలోనే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. సామజవరగమన సినిమా ఓటీటీలో సృష్టించిన రికార్డు వివరాల్లోకి వెళితే..

సామజవరగమన సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో యువ హీరో శ్రీవిష్ణు, సీనియర్ నటుడు వీకే నరేష్, మలయాళ హీరోయిన్ రెబా జాన్ నటించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రాజేష్ దండ నిర్మించారు. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సమర్పకుడిగా వ్యవహరించారు. ఈ చిత్రం జూన్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Samajavaragamana streaming minutes on AHA

సామజవరగమన సినిమా తొలి రోజు నుంచే భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతోపాటు ఇండియాలోని పలు ప్రాంతాల్లో భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ఇండియాలో 23 కోట్ల కలెక్షన్లను నమోదు చేసింది. ఓవర్సీస్‌లో 9.5 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 32.5 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుండగానే.. సామజవరగమన చిత్రం ఓటీటీలో జూలై 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేట్రికల్‌గానే కాకుండా ఓటీటీలో కూడా భారీ స్పందన లభించింది. దాంతో సామజవరగమన రికార్డు వ్యూస్ సాధించింది అని ఆహా ఓ ప్రకటనలో తెలిపింది.

Samajavaragamana streaming minutes on AHA

ఆహా ఓటీటీ నిర్వాహకులు వెల్లడించిన ప్రకారం.. జూలై 27వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతూ భారీ వ్యూస్ సాధించింది. కేవలం 72 గంటల్లో 200 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌ను రికార్డు చేసింది అని తమ ప్రకటనలో తెలిపారు. ఈ సినిమాకు ఓటీటీలో వస్తున్న స్పందన చూస్తే ఇంకా భారీ వ్యూస్ సాధించే అవకాశాలు ఉన్నాయిన తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X