Samajavaragamana OTT: ఆ ఓటీటీకే సామజవరగమన.. అధికారిక ప్రకటన! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరోల్లో శ్రీ విష్ణు ఒకరు. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేసుకున్నాడు. ఎక్కువగా కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్ మెంట్ చిత్రాల్లో నటిస్తూ అలరించాడు. కామెడీ టైమింగ్, డైలాగ్ డెలీవరీతో అభిమానులను సంపాదించుకున్నాడు. శ్రీ విష్ణు తాజాగా నటించిన చిత్రం సామజవరగమన. పాటలోని పదాన్ని టైటిల్ గా తెరకెక్కించిన ఈ సినిమా గురువారం విడుదలై మంచి టాక్ తెచ్చకుంటోంది. ప్రీమియర్ షోలు చూసిన ప్రతి ఒక్కరూ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ తరుణంలో సామజవరగమన ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆసక్తిగా మారింది.
టాలీవుడ్ యంగ్ హీరోల్లో శ్రీ విష్ణు ఒకరు. అనేకమైన సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తూ అలరించిన శ్రీ విష్ణు మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. మెంటల్ మదిలో హీరోగా మారి నీది నాది ఒకే కథ, బ్రోచేవారెవరురా వంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు. అతని కామెడీ టైమింగ్ కు మంచి రెస్ఫాన్స్ వచ్చింది. ఇటీవల అల్లూరి సినిమాతో ప్లాప్ టాక్ అందుకున్న శ్రీ విష్ణు ఇప్పుడు సామజవరగమన మూవీతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు.

సామజవరగమన సినిమాలో శ్రీ విష్ణు సరసన మలయాళీ బ్యూటి రెబ్బ మోనికా జాన్ హీరోయిన్ గా చేసింది. అలాగే వెన్నెల కిశోర్, వీకే నరేష్, దేవి ప్రసాద్, రాజీవ్ కనకాల, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ఆయన ఇంతకుముందు ద్రిష్టి, వివాహభోజనంబు చిత్రాలను డైరెక్ట్ చేశారు. సామజవరగమన సినిమా జూన్ 29న అంటే ఇవాళ విడుదలకు సిద్ధంగా ఉంది.
సామజవరగమన సినిమాకు ఇప్పటికే ప్రీమియర్ షోలు పడగా.. అన్ని వర్గాల నుంచి ఫుల్ ఎంటర్టైన్ మెంట్ మూవీగా ప్రశంసలు పొందుతోంది. ఈ నేపథ్యంలో సామజవరగమన సినిమా ఓటీటీ పార్టనర్ ఎవరనే విషయం ఆసక్తిగా మారింది. అయితే ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రీమియర్ షోలో భాగంగా తెలుగు మీడియా కోసం హైదరాబాద్ ఏఎంబీ సినిమాస్ లో సినిమాను స్క్రీనింగ్ చేయగా.. అందులో ఓటీటీ పార్టనర్ ఆహా అని వెల్లడించారని సమాచారం. ఇక రిలీజ్ తర్వాత నాలుగు వారాలకు ఆహాలో సామజవరగమన స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











