ఓం భీమ్ బుష్ ఓటీటీ డేట్ ఫిక్స్.. నెల కాకుండానే వచ్చేస్తున్న హిట్ మూవీ
టాలీవుడ్‌లో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్లుగా వచ్చే చిత్రాలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. అందుకే ఇలాంటి చిత్రాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగానే వస్తున్నాయి. అలా ఇటీవలే వచ్చిన ఫన్ ఎంటర్‌టైనర్ మూవీనే 'ఓం భీమ్ బుష్'. శ్రీ విష్ణు హీరోగా చేసిన ఈ చిత్రం టైటిల్‌తోనే ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది.
ఫుల్ లెంగ్త్ కామెడీతో రూపొందిన 'ఓం భీమ్ బుష్' మూవీలో శ్రీ విష్ణు హీరోగా నటించగా.. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని శ్రీ హర్ష కనుగంటి తెరకెక్కించాడు. ఈ సినిమాపై ఆరంభంలోనే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ కామెడీ మూవీని మార్చి 22వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ ప్లాన్ చేసేశారు.

డిఫరెంట్ కాన్సెప్టుతో తెరకెక్కిన 'ఓం భీమ్ బుష్' మూవీకి ఆరంభంలోనే అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే ప్రేక్షకులు అదిరిపోయే స్పందనను అందిస్తున్నారు. ఇలా ఈ చిత్రం ఇప్పటికే బిజినెస్ టార్గెట్‌ను పూర్తి చేసుకోవడంతో పాటు రూ. 25 కోట్లకు పైగా గ్రాస్‌ను వసూలు చేసి లాభాల దిశగా ప్రయాణం సాగిస్తోంది.
క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'ఓం భీమ్ బుష్' సినిమాపై మొదటి నుంచీ అంచనాలు ఉండడంతో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌కు మంచి పోటీ ఏర్పడింది. దీంతో తీవ్ర పోటీ నడుమ అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ హక్కుల కోసం సదరు సంస్థ చిత్ర నిర్మాతలకు భారీ మొత్తాన్నే చెల్లించినట్లు ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది.

'ఓ భీమ్ బుష్' సినిమాను థియేటర్లలోకి వచ్చిన 4 వారాల తర్వాతనే స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని అన్నారు. కానీ, ఆ తర్వాత ఇది ఏప్రిల్ 19 నుంచి రాబోతుందని వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 12 నుంచి అమెజాన్ సంస్థ స్ట్రీమింగ్‌కు తీసుకు రాబోతుందట. దీనిపై త్వరలోనే ప్రకటన వస్తుందని టాక్.
ఇదిలా ఉండగా.. విభిన్నమైన కామెడీతో రూపొందిన 'ఓం భీమ్ బుష్' సినిమాను వీ సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మించారు. ఇందులో ప్రీతి ముకుంద్, ప్రియ వడ్లమాని, కామాక్షి భాస్కర్ల, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సన్నీ ఎమ్ఆర్ సంగీతాన్ని సమకూర్చారు.


Click it and Unblock the Notifications











