OTT: నెల కాకముందే ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ.. ఎందుకో తెలుసా?
తెలుగులో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీ విష్ణు. చిన్న పాత్రలు పోషిస్తూ కథానాయకుడిగా తనను తాను ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే ఇటీవల పోలీస్ ఆఫీసర్ గా చేసిన అల్లూరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది.
ఆ ప్లాప్ నుంచి మంచి హిట్ కొట్టాలన్న ఆశయంతో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అయినా సామజవరగమనతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జోరుగా కలెక్షన్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలో సామజవరగమన ఓటీటీ రిలీజ్ డేట్ ఆసక్తిగా మారింది.

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరోల్లో శ్రీ విష్ణు ఒకరు. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేసుకున్నాడు. ఎక్కువగా కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్ మెంట్ చిత్రాల్లో నటిస్తూ అలరించాడు. కామెడీ టైమింగ్, డైలాగ్ డెలీవరీతో అభిమానులను సంపాదించుకున్నాడు. శ్రీ విష్ణు తాజాగా నటించిన చిత్రం సామజవరగమన. పాటలోని పదాన్ని టైటిల్ గా తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 29న విడుదలై మంచి టాక్ తెచ్చకుంటోంది.
సామజవరగమన సినిమాలో శ్రీ విష్ణు సరసన మలయాళీ బ్యూటి రెబ్బ మోనికా జాన్ హీరోయిన్ గా చేసింది. అలాగే వెన్నెల కిశోర్, వీకే నరేష్, దేవి ప్రసాద్, రాజీవ్ కనకాల, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించగా.. నరేష్, వెన్నెల కిశోర్ కామెడీ హాయిగా నవ్విస్తోందని రివ్యూలు తెలిపాయి. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ఆయన ఇంతకుముందు ద్రిష్టి, వివాహభోజనంబు చిత్రాలను డైరెక్ట్ చేశారు.

ప్రస్తుతం సామజవరగమన సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. సుమారు రూ. 8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 12 కోట్ల గ్రాస్, రూ. 24 కోట్ల గ్రాస్ వసూళ్లతో సత్తా చాటుతోంది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ హాట్ టాపిక్ అవుతోంది.
సామజవరగమన సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా సొంతం చేసుకుందని ఇదివరకు తెలిసిందే. అయితే చిత్రాన్ని నెలకాకముందే అంటే జూలై 22 లేదా 25 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. బడ్జెట్ కు మించి లాభాలు రావడంతో సినిమాను తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకే ఇలా రిలీజ్ చేస్తున్నట్లు జోరుగా టాక్ నడుస్తోంది.


Click it and Unblock the Notifications











