Sreeleela దుమ్మురేపుతున్న శ్రీలీల మూవీ.. భారీ రెస్పాన్స్‌తో ఓటీటీలో రచ్చ!

యువ హీరోయిన్ శ్రీలీలకు తెలుగు సినిమా పరిశ్రమలో ఎంత డిమాండ్ ఉన్నదనే విషయాన్ని ఎవరో చెప్పనక్కర్లేదు. కేవలం ఆమె చేస్తున్న సినిమాలు చూస్తే చాలూ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ధమాకా చిత్ర విజయం కేవలం శ్రీలీల కారణంగానే అనే అభిప్రాయం బలంగా ప్రేక్షకులు, సినీ క్రిటిక్స్‌లో ఏర్పడింది. దాంతో టాలీవుడ్‌లో అగ్రహీరోలు, భారీ ప్రాజెక్టుల్లో భారీ ఆఫర్లు ఆమెను వెతుక్కొంటూ వచ్చాయి. శ్రీలీల డిమాండ్ ఎలా ఉంది? ప్రస్తుతం ఆమె నటించిన ఓ సినిమాకు ఆహాలో ఎలాంటి క్రేజ్ ఉందనే విషయంలోకి వెళితే..

కిస్ అనే కన్నడ సినిమాతో కెరీర్ ప్రారంభించిన శ్రీలీల.. తెలుగులో పెళ్లి సందD చిత్రంతో భారీ సక్సెస్ అందుకొన్నది. ఆ తర్వాత జేమ్స్, ధమకా చిత్రంతో ఓవర్‌నైట్‌లోనే స్టార్ హీరోయిన్‌గా మారింది. అంతేకాకుండా శ్రీలీల ప్రస్తుతం భారీ రెమ్యునరేషన్ అందుకొంటున్న యువ హీరోయిన్లలో ఒకరిగా మారింది.

Sreeleelas I Love You Idiot getting good response in AHA OTT

ధమాకా చిత్రంలో రవితేజతో కలిసి గ్లామర్ పంట పడించింది. అందాల ఆరబోతతోపాటు పాటల్లో ఆమె వేసిన స్టెప్పులతో బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిసింది. ఏకంగా ఆ సినిమాను 100 కోట్ల క్లబ్‌లో చేసేలా శ్రీలీల కెమిస్ట్రీ పనిచేసింది. ధమాకా మూవీ సృష్టించిన మ్యాజిక్‌తో మహేష్, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ లాంటి హీరోల సినిమాల్లో నటించే అవకాశాన్ని చేజిక్కించుకొన్నది.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సరసన SSMB28, పంజా వైష్ణవ్ తేజ్ నాలుగో చిత్రంలోను, నితిన్‌ నటించే తన 32వ చిత్రంలోను, అలాగే అనగనగా ఒక రాజు, జూనియర్, బోయపాటి చిత్రం, NBK108 చిత్రంలో నటిస్తున్నది. ఇలా చేతినిండ అరడజన్ చిత్రాలతో బిజీగా మారిపోవడమే కాకుండా భారీ క్రేజ్‌ను సొంతం చేసుకొన్నది.

Sreeleelas I Love You Idiot getting good response in AHA OTT

ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలీల నటించిన ఐ లవ్ యూ ఇడియట్ అనే చిత్రం ఆహాలో విడుదలైంది. ఈ సినిమాకు ఏపీ అర్జున్ దర్శకుడు, సాయికిరణ్ బత్తుల, సుదర్శన్ గౌడ్ బత్తుల నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీలీల గ్లామర్, డ్యాన్సులు హైలెట్‌ అని చెబుతున్నారు. కేవలం గ్లామర్‌తోనే కాకుండా ఫెర్ఫార్మెన్స్‌తో మెప్పిస్తుండటంతో భారీ ప్రాజెక్టులు ఆమెను పలకరిస్తున్నాయి.

ఐ లవ్ ఇడియట్ చిత్రం ప్రస్తుతం టాప్ రేటింగ్ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ ఫ్లాట్‌ఫాంపై భారీ రెస్పాన్స్ ఈ సినిమా సొంతం చేసుకొంటున్నది. ఈ సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
మ్యూజిక్: వీ హరికృష్ణ
సాంగ్స్: పూర్ణా చారీ
సాహిత్యం: అర్జున్ శెట్టి
ఎడిటర్: దీపు ఎస్ కుమార్
ఆర్ట్: రవి ఎస్
ఫైట్స్: కే రవివర్మ
కొరియోగ్రఫి: ఇమ్రాన్ సర్దారియా

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X