Sreemukhi: ఊ అంటావా మావ పాటతో శ్రీముఖి రచ్చ.. శేఖర్ మాస్టర్ తో అలాంటి స్టెప్పులు..

టెలివిజన్ ప్రపంచంలో మంచి యాంకర్ గా గుర్తింపు అందుకున్న వారిలో శ్రీముఖి ఒకరు. శ్రీముఖి ఎలాంటి ప్రోగ్రాం చేసిన కూడా ఓ వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా ఆమె గ్లామర్ తోనే ఇటీవల కాలంలో కుర్రాలను తన వైపుకు తిప్పుకుంటుంది. ఇక టెలివిజన్ షోలు మాత్రమే కాకుండా శ్రీముఖి ఓటీటీలో కూడా రీసెంట్ గా తన సరికొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఓంకార్ హోస్టింగ్ తో వస్తున్న డాన్స్ ఐకాన్ షోలో శ్రీముఖి పుష్ప ఐటెం సాంగ్ తో క్రియేట్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారుతొంది పూర్తి వివరాల్లోకి వెళితే..

స్టేజ్ మీదకు వస్తే..

స్టేజ్ మీదకు వస్తే..

శ్రీముఖి కెమెరా ముందు అయినా సరే కెమెరా లేకున్నా సరే చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తుంది అని అందరూ అంటూ ఉంటారు. స్టేజి మీదకు వచ్చింది అంటే ఒక తెలియని వైబ్రేషన్ కూడా క్రియేట్ అవుతుంది అని చెప్పవచ్చు. మొదట పటాస్ షో ద్వారా తన ప్రయాణం మొదలు పెట్టిన ఆమె ఆ తరువాత వివిధ రకాల ప్రత్యేకమైన టెలివిజన్ షో లతో మంచి గుర్తింపును అందుకుంది.

 ఓటీటీ లో కూడా

ఓటీటీ లో కూడా

కేవలం టెలివిజన్ షో లు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా ప్రత్యేకమైన పాత్రలలో మెరుస్తున్న శ్రీముఖి వీలైనంతవరకు మంచి కంటెంట్ ఉన్న క్యారెక్టర్ లను సెలెక్ట్ చేసుకుంటుంది. అయితే శ్రీముఖి సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా బుల్లితెరకు మాత్రం బ్రేక్ ఇవ్వడం లేదు. అలాగే ఇప్పుడు ఓటీటీ రియాల్టీ షోలలో కూడా ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

 ఆహా ఐకాన్ షోలో

ఆహా ఐకాన్ షోలో

రీసెంట్ గా ఆహా ఓటీడీ ఫ్లాట్ ఫార్మ్ లో కూడా ఆమె ఇచ్చిన ఎంట్రీ మామూలుగా వర్కౌట్ కాలేదు. వచ్చి రావడంతోనే శ్రీముఖి ఉ అంటావా మామ అనే పాటతో సరికొత్తగా ఆకట్టుకుంది. ఆహాలు డాన్స్ ఐకాన్ షో ప్రస్తుతం మంచి కేజీ ఏర్పడింది. ఇక సెప్టెంబర్ 11వ తేదీన ఈ టాలెంట్ షో గ్రాండ్ గా మొదలు కాబోతోంది. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ కు సంబంధించిన షూటింగ్స్ కూడా పూర్తి చేశారు.

 శేఖర్ మాస్టర్ తో కూడా

శేఖర్ మాస్టర్ తో కూడా

అయితే ప్రత్యేకమైన ఎపిసోడ్లో శ్రీముఖి చేయబోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉండబోతోందని తెలుస్తోంది. అందుకు సంబంధించిన స్పెషల్ ప్రోమో కూడా విడుదల చేశారు పాటను శ్రీ ముఖి చాలా అద్భుతంగా చేసింది. ఇక ఆమెకు తోడుగా ప్రముఖ డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ కూడా అదిరిపోయే స్టెప్పులతో అనిపించారు. ఇక వీరి స్టెప్పులు చూసిన వారు అద్భుతంగా ఉంది అని.. శ్రీముఖి మరోసారి విజిల్ వేయించేలా పర్ఫామెన్స్ ఇచ్చింది అని పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

సినిమాలలో అవకాశాలు

ఇక ఈ స్పెషల్ ఐకాన్ డాన్స్ షో పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఓంకార్ కూడా మొట్ట మొదటిసారి ఓటీటీ ద్వారా తన సరికొత్త హోస్టింగ్ తో ఆకట్టుకుపోతున్నాడు. అల్లు అరవింద్ కూడా ఈ షోలో ప్రత్యేక జడ్జ్ గా కనిపిస్తూ ఉండడం విశేషం. అంతే కాకుండా మరి కొంతమంది ప్రముఖ నిర్మాతలు కూడా ఈ షోలో ప్రత్యేక అతిధులుగా రాబోతున్నారు. ఇక టాలెంట్ ఉన్న వారికి ప్రొడ్యూసర్స్ సినిమాలలో అవకాశాలు కూడా ఇవ్వబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X