OTT: 3 వారాల్లోనే ఓటీటీలోకి సూపర్ హీరో లాంటి సినిమా.. ప్రశాంత్ నీల్ కథతో సినిమా , ఎందులో అంటే?

ప్రపంచ సినిమా దగ్గర ఉన్నటువంటి ఎన్నో క్రేజీ జానర్ చిత్రాల్లో సూపర్ హీరో జానర్ మూవీస్‌ కూడా ఒకటి. మన ఇండియన్ సినిమా దగ్గర మాత్రం ఈ జానర్ లో సినిమాలు చాలా అంటే చాలా తక్కువే అని చెప్పాలి. కానీ దాదాపు అన్ని భాషల్లో కూడా ఈ సూపర్ హీరో జానర్ సినిమాలు వచ్చాయి. మన తెలుగులో అయితే కొంచెం లేట్ అని చెప్పాలి.

కానీ లేట్ గానే వచ్చినా తెలుగులో మాత్రం హను మాన్ సినిమా సెన్సేషనల్ వసూళ్లు కొల్లగొట్టి దుమ్ము లేపింది. ఇక మరిన్ని సినిమాలు కూడా వస్తున్నాయి. అయితే ఈ ఏడాదిలోనే మన సౌత్ నుంచి సూపర్ హీరో లాంటి సినిమా ఇంకొకటి కూడా వచ్చింది. ఆ సినిమానే కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమా "బఘీరా".

sri murali bagheera comes in ott for 3 weeks only here you can watch

ఈ చిత్రాన్ని కన్నడ బిగ్ స్టార్స్ కలయికలో తీసుకురాగా మన దగ్గర పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన బిగ్ ప్రాజెక్ట్ సలార్ సినిమా ఒరిజినల్ సినిమా "ఉగ్రమ్" సినిమా హీరో శ్రీమురళీ ఇందులో నటించారు. సలార్, ఉగ్రమ్ సినిమాలకి పవర్ఫుల్ కథలు అందించిన సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి కూడా కథ అందించడం విశేషం.

కాగా ఈ సినిమాని కూడా మేకర్స్ ప్రశాంత్ నీల్ మార్క్ భారీ ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ తో తెరకెక్కించారు. ఈ సినిమా మొన్న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడతో పాటు తెలుగులో కూడా విడుదల అయ్యిన ఈ చిత్రం అనుకున్న రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. నీల్ కథ లోనే పెద్దగా పస లేకపోయే సరికి ముందు తెలుగులో తేలిపోయింది. అలాగే కన్నడంలోనూ ఓ మాదిరిగా ఆడింది.

ఈ అక్టోబర్ 31న థియేటర్స్ లో విడుదల అయిన ఈ చిత్రం నెల కూడా తిరక్కుండా కేవలం మూడు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చి షాకిచ్చింది . అన్నట్టు ఈ సినిమా బిగ్గెస్ట్ ఓటీటీ హక్కుల్ని వరల్డ్ పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ఈ సినిమాని నేటి నుంచి తమ స్ట్రీమింగ్ యాప్ లో అందుబాటులోకి తెచ్చేసింది. ఈ చిత్రం కొంచెం డిఫరెంట్ గా వచ్చింది అని చెప్పాలి. మామూలుగా పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి వస్తాయి.

sri murali bagheera comes in ott for 3 weeks only here you can watch

కామన్ గా హిందీ సహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే సినిమాలు. కానీ హిందీ మినహా మిగతా సౌత్ భాషల్లో ఈ సినిమా వచ్చింది. అయితే వీటితో పాటుగా తులు భాషలో కూడా వస్తున్నట్టుగా నిన్న కన్ఫర్మ్ చేశారు. కానీ లేటెస్ట్ గా నేటి నుంచి మాత్రం కేవలం ఒరిజినల్ కన్నడ అలాగే మన తెలుగు భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు.

అలాగే మిగతా భాషల్లో అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం అన్నట్టుగా నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. సో ఈ సూపర్ హీరో కాని సూపర్ హీరో సినిమాని చూడాలి అనుకుంటే నెట్ ఫ్లిక్స్ లో ట్రై చేస్కోవచ్చు. కాగా ఈ చిత్రంలో శ్రీమురళి సరసన బ్యూటిఫుల్ హీరోయిన్ రుక్మిణి వసంత్ నటించగా సలార్, కేజిఎఫ్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X