ఒకేసారి ఓటీటీ, యూట్యూబ్‌లోకి క్రేజీ మూవీ.. ఈ మల్టీస్టారర్ సినిమాను ఎలా చూడాలంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఆంథాలజీ (రెండు మూడు కథల సమాహారం) మూవీలు బాగానే ఉన్నాయి. ఉదాహరణకు 'మనమంతా', 'కేరాఫ్ కంచెరపాలెం' ఇలాంటి చిత్రాలు వచ్చి ప్రేక్షకులను అలరించాయి. దీంతో అదే తరహాలో మరిన్ని సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. అలా ఇటీవలే విడుదలైన క్రేజీ సినిమానే 'శ్రీరంగనీతులు' (Sri Ranga Neethulu).
సుహాస్, కార్తీక్ రత్నం, రుహానీ శర్మ, విరాజ్ అశ్విన్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమానే 'శ్రీరంగనీతులు'. ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు అనుకున్న దానికంటే ఎక్కువగానే ఏర్పడ్డాయి. ఫలితంగా ఏప్రిల్ 11వ తేదీన ఇది ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

మంచి బజ్‌తో రూపొందిన 'శ్రీరంగనీతులు' సినిమాకు ప్రీమియర్స్ నుంచి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో ఆరంభంలోనే దీనికి మంచి స్పందన లభించలేదు. ఆ తర్వాత కూడా ఇది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విఫలం అయింది. ఫలితంగా ఈ మల్టీస్టారర్ సినిమా కేవలం వారం రోజుల్లోనే రన్‌ను ముగించింది. తద్వారా నష్టాలతో పరాజయం పాలైంది.
థియేటర్లలో అంతగా సందడి చేయలేకపోయిన 'శ్రీరంగనీతులు' సినిమా అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, 45 రోజులు దాటిపోయినా ఎలాంటి సమాచారం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ చిత్రం ఆహా ఓటీటీలో ప్రత్యక్షం అయింది. దీన్ని సదరు సంస్థ అందుబాటులోకి తీసుకు వచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది.
ఓటీటీలోకి తాజాగా వచ్చిన 'శ్రీరంగనీతులు' సినిమాకు సంబంధించి మరో బిగ్ సర్‌ప్రైజ్ కూడా వచ్చింది. దీన్ని స్ట్రీమింగ్‌కు వచ్చిన ఒక్కరోజుకే యూట్యూబ్‌లో కూడా విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని భవానీ మీడియా అధికారికంగా వెల్లడించింది. మే 30వ తేదీ నుంచి 'శ్రీరంగనీతులు' సినిమాను అందుబాటులోకి తెస్తున్నట్లు ఓ పోస్టును కూడా చేసింది.
ఇదిలా ఉండగా.. ఆంథాలజీ కాన్సెప్టుతో రూపొందిన 'శ్రీరంగనీతులు' సినిమాను రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై బల్మూరి వెంకటేశ్వర్రావు నిర్మించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు. ఇందులో ప్రధాన నటీనటులతో పాటు రాగ్ మయూర్, తణికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, దేవీ ప్రసాద్ తదితరులు నటించారు.


Click it and Unblock the Notifications











