Mathu Vadalara 2: ఆ ఓటీటీలోనే ఫన్ సినిమా.. ఎన్ని రోజులకు వస్తుందంటే!
ఈ మధ్య కాలంలోనే టాలీవుడ్‌లో ఎంతో మంది వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే విజయాలను అందుకుని మంచి ఆరంభాలను అందుకున్నారు. మిగిలిన వాళ్లు మాత్రం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా సక్సెస్‌ను మాత్రం ఖాతాలో వేసుకోవట్లేదు. అలాంటి వారిలో కీరవాణి కుమారుడు శ్రీ సింహా కోడూరి ఒకడు.
'మత్తు వదలరా' అనే మూవీతో శ్రీ సింహా కోడూరి హీరోగా పరిచయం అయ్యాడు. ఇది మంచి టాక్‌ను తెచ్చుకున్నా సక్సెస్‌ను మాత్రం దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత కూడా అతడు పలు సినిమాలను చేసినా హిట్లు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న కసితో మొదటి చిత్రానికి సీక్వెల్‌గా 'మత్తు వదలరా 2' అనే సినిమాను చేశాడు.

శ్రీ సింహా కోడూరి హీరోగా నటించిన తాజా సినిమానే 'మత్తు వదలరా 2'. రితేష్ రానా దర్శకత్వంలో రూపొందిన ఫుల్ లెంగ్త్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీనికితోడు ప్రచారం చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. ఫలితంగా భారీ హైప్‌తో ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ప్రీమియర్స్ నుంచి డీసెంట్ టాక్‌తో పాటు రివ్యూలు కూడా వస్తున్నాయి.
కడుపుబ్బా నవ్వించే కథతో రూపొందిన 'మత్తు వదలరా 2' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ గురించిన వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఈ మూవీకి మంచి టాక్ రావడంతో చాలా సంస్థలు హక్కుల కోసం పోటీ పడ్డాయి. ఈ క్రమంలోనే ఈ చిత్రం ఓటీటీ హక్కులను ఫేమస్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కొనుక్కుంది. దీన్ని చిత్ర యూనిట్ టైటిల్స్‌లో కూడా రివీల్ చేసింది.

'మత్తు వదలరా 2' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి కూడా తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ చిత్రాన్ని థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్ సంస్థతో నిర్మాతలు డీల్ చేసుకున్నారట. దీని ప్రకారం.. సెప్టెంబర్ 13న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. అక్టోబర్ మూడో వారంలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది.
ఇదిలా ఉండగా.. ఫన్ స్టోరీతో రూపొందిన 'మత్తు వదలరా 2' సినిమాను క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై చిరంజీవి పెద్దమల్లు, హేమలత పెద్దమల్లు నిర్మించారు. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా చేయగా.. సత్య కీలక పాత్రలో నటించాడు. అలాగే, వెన్నెల కిశోర్, సునీల్ నటించారు. ఈ మూవీకి కాల భైరవ సంగీతాన్ని అందించాడు.


Click it and Unblock the Notifications











