ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ తెలుగు కామెడీ మూవీ.. నవ్వి నవ్వి చావాల్సిందే, స్ట్రీమింగ్ ఎందులో అంటే?
ప్రస్తుతం బాక్సాఫీస్ పెద్ద సినిమాలు ఫట్ అవుతుండగా.. చిన్న సినిమాలు మాత్రం బ్రహ్మాండమైన వసూళ్లు సాధిస్తున్నాయి. కమిటీ కుర్రోళ్లు, ఆయ్, 35 చిన్న కథ కాదు వంటి స్మాల్ బడ్జెట్ మూవీస్ మంచి వసూళ్లను సాధించి థియేటర్లు కళకళలాడేలా చేశాయి. ఈ కోవలోనే శ్రీసింహా, కమెడియన్ సత్య , వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించిన మత్తు వదలరా 2 సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా విడుదలైన మత్తు వదలరా 2 మంచి వసూళ్లు సాధించి థియేటర్ బిజినెస్ క్లోజ్ చేసింది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో అడుగుపెట్టనుంది. ఆ వివరాల్లోకి వెళితే :
తెలుగునాట క్రైమ్ , కామెడీ కాంబినేషన్‌లో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది మత్తు వదలరా 2. ఐదేళ్ల క్రితం రితేష్ రాణా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనాన్ని బాగా నవ్వించింది. ఈ మూవీలోని తస్కరణ అనే పదం బాగా పాపులర్ అయ్యింది. అలాంటి సినిమాకు సీక్వెల్ అనేసరికి ఆడియన్స్‌లోనూ, టాలీవుడ్ వర్గాల్లోనూ మంచి అంచనాలున్నాయి. శ్రీ సింహా హీరో కావడంతో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుటుంబం ఈ మూవీకి అండగా నిలిచింది. స్వయంగా జక్కన్న ముందుకొచ్చి ప్రమోషన్ చేయడం మత్తువదలరా 2కి ప్లస్ పాయింట్‌గా మారింది.

దొంగతనాలు, హత్య కేసుల్లో ఇరుక్కోవడంతో సత్య, శ్రీసింహాలు తమ ఉద్యోగాలను కోల్పోతారు. తర్వాత హై ఎమర్జెన్సీ అనే టీమ్‌లో ఉద్యోగం సంపాదించుకుని కిడ్నాప్ కేసులను డీల్ చేస్తుంటారు. తమకు వచ్చే జీతం ఏ మూలకి చాలకపోవడంతో తస్కరణ అనే విద్యను మరోసారి వాడాల్సి వస్తుంది. ఈ క్రమంలో రెండు హత్య కేసుల్లో ఇరుక్కుని చిక్కుల్లో పడతారు. ఈ కేసుల్లోంచి శ్రీసింహా, సత్యలు ఎలా బయటపడ్డారు, వారిని ఇరికించిందెవరు , ఫరియా అబ్దుల్లా ఎవరు, ఆ క్యారెక్టర్‌తో హీరోలకి ఉన్న సంబంధం ఏంటీ అన్నదే మత్తువదలరా 2 కథ.
మత్తువదలరా సక్సెస్ కారణంగా పార్ట్ 2కి ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. నైజాం రూ.కోటిన్నర, సీడెడ్ రూ.50 లక్షలు, ఆంధ్ర రూ.1.20 కోట్లు , ఏపీ తెలంగాణ కలిపి టోటల్‌గా రూ.3.20 కోట్లకు, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ రూ.80 లక్షలు, వరల్డ్ వైడ్ టోటల్‌గా రూ.4 కోట్ల మేర మత్తు వదలరా 2 థియేట్రికల్ బిజినెస్ జరిగింది. రూ. 4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన మత్తువదలరా 2 .. థియేటర్‌లలో క్లోజయ్యే నాటికి దాదాపు రూ.35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని అందుకుని దాదాపు రూ.19 కోట్ల లాభాలను అందించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే పెట్టిన పెట్టుబడిపై దాదాపు 22.31 శాతం ప్రాఫిట్ అన్నమాట.

థియేటర్‌లో బిజినెస్ క్లోజ్ చేసిన మత్తువదలరా 2 .. నాలుగు వారాల రూల్‌కి అనుగుణంగా ఓటీటీలో అడుగుపెట్టాలని చూస్తోంది. అక్టోబర్ 11 నుంచి ప్రముఖ ఓటీటీ యాప్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. దసరా పండుగ వేళ కుటుంబమంతా హాయిగా నవ్వుకోవడానికి సిద్ధమా మరి.


Click it and Unblock the Notifications











