OTTలోకి సూపర్ హిట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్.. ఎందులో చూడాలో తెలుసా?
సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రమే 'కోట బొమ్మాళి పీఎస్'. విడుదలకు ముందే ఈ సినిమాలోని లింగిడి అనే సాంగ్ సోషల్ మీడియాలో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు చిన్న పెద్ద తేడా లేకుండా స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా గతనెలలో 24న రిలీజ్ అయి.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఆ వివరాల్లోకి వెళితే...
ఓటీటీలోకి మరో కొత్త సినిమా రాబోతుంది. హీరో శ్రీకాంత్ మేక హీరోగా నటించిన చిత్రం కోట బొమ్మాళి పీఎస్. ఈ సినిమాకు తేజా మార్ని దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. మలయాళీ సూపర్ హిట్ నాయాట్టు సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా.. నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాను జీఏ 2 సంస్థ నిర్మించింది.

విడుదలకు ముందే ఈ సినిమాకు మంచి పబ్లిసిటీ వచ్చింది. దానికి కారణం ఈ సిినిమాలోని లింగిడి సాంగ్. ఇక ఈ సాంగ్.. సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయకుండానే ఫుల్గా పబ్లిసిటీ వచ్చేసిందనే చెప్పాలి. ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకుంది. నిర్మాతలకు భారీ లాభాలను తీసుకువచ్చింది ఈ మూవీ.
థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా న్యూఇయర్ వీకెండ్ లో ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం జనవరి 5న స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు కానీ.. ఈ న్యూస్ మాత్రం నెట్టింట్లో వైరల్ గా మారింది.
కోట బొమ్మాళి పీఎస్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ ను మేకర్స్ అధికారిక ప్రకటన చేయబోనున్నారట. ఇప్పటివరకు థియేటర్లలో మిస్ అయిన కోట బొమ్మాళి సినిమాను వచ్చే ఏడాది ఇంట్లోనే హ్యాపీగా చూసేయండి. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే... ఒక రాజకీయ నాయకుడి కారణంగా ముగ్గురి పోలీసుల జీవితాలు తారుమారవగా.... ఆ తర్వాత ఓరోజు రాత్రి ఈ ముగ్గురు ప్రయాణిస్తున్న కారు యాక్టిడెంట్ అవుతుంది.

.ఆ ప్రమాదంలో నియజకవర్గంలో ఎక్కువ ఓట్లు ఉన్న సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చనిపోతాడు. దీంతో ఈ ముగ్గురి పోలీసుల జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. వారిని చట్టం శిక్షించిందా... అనేది కోట బొమ్మాళి కథ. ఇందులో శ్రీకాంత్ మేక, వర లక్ష్మీ, శివాని, రాహుల్ విజయ్ తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు.


Click it and Unblock the Notifications











