SSMB 28: పాత రికార్డు బ్రేక్ అయ్యేలా నాన్ థియేట్రికల్ బిజినెస్.. మహేష్ త్రివిక్రమ్ కెరీర్ బెస్ట్ అనేలా..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసినా కూడా బిజినెస్ హై రేంజ్ లో పెరుగుతుంది. ఇక డైరెక్టర్ కాంబినేషన్ క్లిక్ అయితే పాత రికార్డులు బ్లాస్ట్ అవుతాయి. ఇక అతడు మహేష్ ఖలేజా వంటి సినిమాలు తర్వాత చాలా కాలానికి మహేష్ బాబు త్రివిక్రమ్ ఒక సినిమా చేస్తున్నారు. మహేష్ బాబు 28వ సినిమాగా చెబుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ లెక్కలు మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

13 ఏళ్ల తర్వాత..
మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే SSMB 28 పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. వీరిద్దరి కాంబినేషన్ లో దాదాపు 13 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో టాలీవుడ్ ట్రేడ్ వర్గాల వారికి కూడా ఈ సినిమా మీద ఆసక్తి ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి మంచి మంచి ఆఫర్లు రాగా ఇప్పుడు నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో ఒక ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది.

నెట్ ఫ్లిక్స్ డీల్
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ హక్కులు కొనుగోలు చేసినట్లుగా నెట్ ఫ్లిక్స్ సంస్థ చాలా రోజుల క్రితమే ప్రకటించింది. అయితే ఈ సంస్థ మహేష్ బాబు సినిమాని భారీ ధరకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసినట్లుగా స్వయంగా ప్రకటించుకున్నది కానీ ఇంకా రేటు విషయంలో ఒక క్లారిటీ లేదని అంటున్నారు.

ఆ రేటు ఫిక్స్
అన్ని భాషలకు రేటు 70 కోట్లకు తగ్గేది లేదని నిర్మాతలు చెబుతున్న నెట్ ఫ్లిక్స్ కొంత బేరం ఆడుతున్నట్లుగా తెలుస్తోంది. కాకపోతే కచ్చితంగా నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారికంగా ప్రకటన చేశారు కాబట్టి కొంచెం ఎక్కువైనా ఇక నెట్ ఫ్లిక్స్ దీన్ని దక్కించుకోవడం తప్పదని అంటున్నారు.

ఆడియో
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా ఆడియో హక్కులను కూడా ఒక ప్రముఖ ఆడియో సంస్థ 20 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. గత వారం రోజుకుగా నిర్మాతతో ప్రముఖ ఆడియో సంస్థ చర్చలు జరుపుతోంది. థమన్ కూడా ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఈ రూట్లో భారీగా ఆదాయం అందే అవకాశం ఉంది. ఈ డీల్ ఓకే అయితే న్యూ రికార్డ్ క్రియేట్ అయినట్లే.

కెరీర్ బెస్ట్
అలా ఓటీటీ ఆడియో డిజిటల్ రైట్స్ కారణంగా నాన్ థియేట్రికల్ గా ఈ సినిమా దాదాపుగా 90 కోట్లు సినిమాకు వచ్చే అవకాశం ఉంది. 90 కోట్లు అంటే త్రివిక్రమ్, మహేష్జ్ కెరీర్ లో కూడా ఇది బెస్ట్ రికార్డ్ అవుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారులలో జరుగుతోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక హాసిని బ్యానర్ మీద ఈ సినిమాని చినబాబు నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమాని ఆగస్టు నెలలో విడుదల చేయాలని అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











