డైరెక్ట్‌గా OTTలోకి సెన్సేషన్ క్రియేట్ చేసిన స్టార్ సింగర్ బయోపిక్.. ఎక్కడ చూడాలంటే?
ఈ మధ్య కాలంలో అనేక సినిమాలు అటు థియేటర్లతో పాటు ఇటు ఓటీటీలోనూ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని పెద్ద సినిమాలు కూడా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే తాజాగా ఓ అద్భుతమైన సినిమా నేరుగా ఓటీటీలో విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతుంది. ముఖ్యంగా దేశాన్ని ఓ ఊపు ఊపిని సెన్సేషనల్ స్టార్ సింగర్ అమర్ సింగ్ చక్మీలా బయోపిక్ ను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. అయితే ఆ సినిమా ఏంటి, ఏ ఓటీటీ వేధికగా ఈ సినిమా విడుదల కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అమర్ సింగ్ చమ్కిలా.. ఈ పేరు తెలియని భారతీయులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఈయన పంజాబీలు నిర్మించిన అత్యుత్తమ లైవ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ లో ఈయన కూడా ఒకరు. ఈయన ఎక్కువగా గ్రామాల్లో లైవ్ పర్ఫార్మెన్స్ లు ఇస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. సాధారణంగా ఈయన వివాహేతర సంబంధాలు, యుక్త వయస్సు, మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగం, పంజాబీ పురుషుల వేడి స్వభావాల గురించి పాటలు రాశాడు.

అలా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈయన చివరకు హత్యకు గురయ్యాడు. ఈయనతో పాటు ఈయన భార్య, ఇద్దరు గ్రూపు సభ్యులు కూడా ఒకేసారి హత్యకు గురయ్యారు. ఇలా దేశాన్నే ఓ కుదుపు కుదిపిన ఈయన జీవిత చరిత్రను సినిమాగా మలిచారు డైరెక్టర్ ఇంతియాజ్ అలి. దిల్జిత్ దోసాంజ్, పరిణీతి చోప్రాలు హీరోహీరోయిన్లుగా.. అమర్ సింగ్ చమ్కిలా బయోపిక్ ను తెరకెక్కించారు. ఈ చిత్రంలో నిషా బనో, రాహుల్ మిత్రా, అంజుమ్ భత్రా, అపింద్రదీప్ సింగ్, విపిన్ కత్యల్, ఉదయ్ బిర్ సంధు వంటి వాళ్లు కూడా నటించారు.

అయితే చమ్కిలా అనే ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని చిత్రబృందం డిసైడ్ చేసింది. ఇలా ఈ సినిమా హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థకు అమ్మేసింది. అలా ఈ చిత్ర హక్కలను కొనుగోలు చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ సినిమా విడుదల తేదీని ఎక్స్ వేధికగా ప్రకటించింది. ఏప్రిల్ 12వ తేదీన చమ్కిలా సినిమాను నెట్ ఫ్లిక్స్ వేధికగా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. మరి ఇంకెందుకు ఆలస్యం... పంజాబీలను తెగ ప్రభావితం చేసిన అమర్ సింగ్ చమ్కిలా బయోపిక్ ను చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











