ఓటీటీలోకి సమంత నిర్మించిన మూవీ.. శుభం స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో అంటే?

దాదాపు 15 ఏళ్లుగా ఎన్నో విభిన్నమైన పాత్రలతో దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా నిలిచారు సమంత రూత్ ప్రభు. ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్లు వచ్చారు, వెళ్లారు.. కానీ సమంత మాత్రం తన స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో సినిమాలు చేయకున్నా సామ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. హీరోయిన్‌గా సక్సెస్ కొట్టిన సమంత ఇటీవల నిర్మాతగానూ మారిన సంగతి తెలిసిదే. ట్రా లా లా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌‌ను స్థాపించిన సామ్.. తొలి ప్రయత్నంగా నిర్మించిన చిత్రమే శుభం. ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని తాజాగా ఓటీటీ రిలీజ్ కన్ఫర్మ్ చేసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే..

శుభంలో సమంత కీలకపాత్ర

శుభం చిత్రానికి బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. సమంత ఓ కీలకపాత్ర పోషించగా.. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీ, శ్రీయా కొంతం, శ్రావణి లక్ష్మీ, శాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్, గంగవ్వ తదితరులు నటించారు. మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. కుటుంబ ప్రేక్షకులు సినిమాను బాగానే ఆదరించారు.

Subham OTT Release samantha ruth prabhu s Horror comedy movie ready to Stream online

శుభం సినిమాపై బజ్

శుభం చిత్రాన్ని దాదాపు 3.5 కోట్ల రూపాయల బడ్జెట్‌తో సమంత నిర్మించినట్లు ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాల తర్వాత ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. దీని కారణంగా శుభం సినిమాకు థియేట్రికల్‌గా మంచి బిజినెస్ జరిగింది. ఈ సినిమాను నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేయగా. మిగితా ప్రాంతాల్లో ఆయా ఏరియాల డిస్టిబ్యూటర్లు హక్కులు దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. శుభం చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.4 కోట్ల షేర్.. రూ.8 కోట్ల గ్రాస్ వసూళ్లు రావాల్సి ఉంటుందని విలువ కట్టారు. తెలుగు రాష్ట్రాల్లో 300 స్క్రీన్లు, వరల్డ్ వైడ్‌గా 500 స్క్రీన్లలో శుభం మూవీ రిలీజైంది.

శుభం కలెక్షన్స్

మంచి సినిమాగా టాక్ తెచ్చుకున్న శుభం సినిమాకు తొలుత కలెక్షన్స్ నిరాశపరిచినా తర్వాత పెరుగుతూ వచ్చాయి. తొలి రోజు ఇండియాలో రూ.60 లక్షలు రాబట్టిన ఈ మూవీ.. తొలివారం రూ.4.15 కోట్లు ఆర్జించినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. రెండు, మూడు వారాల్లోనూ నిలకడగా రాణించినప్పటికీ క్రమేపీ కలెక్షన్స్ పడిపోయాయి . 25 రోజుల వరకు సమంత మూవీ ఇండియాలో రూ.7.40 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.3.20 కోట్ల షేర్, 6.60 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అటు ఓవర్సీస్ విషయానికి వస్తే రూ.2 కోట్లు వసూలు చేసింది. దీంతో సమంత మూవీ వరల్డ్ వైడ్‌గా రూ.9 కోట్ల నెట్, రూ.12.60 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ఫిలింనగర్ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తంగా తొలి సినిమాకు సమంత మంచి లాభాలనే అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి.

ఓటీటీ డీల్‌లో గందరగోళం

శుభం సినిమాను ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూస్తామా? అని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్, శాటిలైట్ రైట్స్‌ను జీ 5 ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. అయితే శుభం తొలిరోజు కలెక్షన్స్, ప్రేక్షకుల స్పందన చూసిన తర్వాత ఒప్పందాన్ని మరోసారి పున: సమీక్షించాలని నిర్మాతలను కోరింది. ఈ క్రమంలో నిర్మాతగా ఉన్న సమంత .. జీ5తో ఒప్పందాన్ని రద్దు చేసి జియో హాట్‌స్టార్‌తో కొత్తగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఈ పరిణామాలతో శుభం ఓటీటీ రిలీజ్ ఆలస్యమైంది. తాజాగా ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ జూన్ 13 నుంచి శుభం తమ ఓటీటీలో అందుబాటులో ఉంటుందని జియో హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. మరి ఓటీటీలో శుభం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X