Subham OTT Release : సమంత నిర్మించిన శుభం ఏ ఓటీటీలోకి?.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

హీరోయిన్‌గా సక్సెస్ కొట్టిన సమంత నిర్మాతగానూ మారారు. ట్రా లా లా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌‌ను స్థాపించిన సామ్.. తొలి ప్రయత్నంగా నిర్మించిన చిత్రమే శుభం. బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సమంత, హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీ, శ్రీయా కొంతం, శ్రావణి లక్ష్మీ, శాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్, గంగవ్వ తదితరులు నటించారు. మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు , హిట్ టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో శుభం సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

సమంత కోసం టాలీవుడ్ ఎదురుచూపులు

నాగచైతన్యతో విడాకులు, మయోసైటిస్ వ్యాధితో బాధపడి తిరిగి కోలుకున్నారు సమంత. ఆ తర్వాత బాలీవుడ్‌పైనే ఫోకస్ చేసిన సామ్ అక్కడ క్రేజీ వెబ్‌సిరీస్‌లలో నటించి సక్సెస్ కొట్టారు. దీంతో టాలీవుడ్‌కు సమంత తిరిగి వస్తారా? లేదా? అంటూ ఆమె అభిమానులు వెయిట్ చేశారు. శాకుంతలం, ఖుషీ సినిమాలపై సమంత ఎన్నో ఆశలు పెట్టుకోగా.. అవి ఫ్లాప్ కావడంతో నిరాశ చెందారు. ఇక నాటి నుంచి టాలీవుడ్‌కు పూర్తిగా దూరమయ్యారు సామ్. తెలుగు ప్రేక్షకులు మాత్రం సమంత రీ ఎంట్రీ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

Subham OTT Release when to expect samantha ruth prabhu s movie to stream online

నిర్మాతగా సమంత ఎంట్రీ

ఇలాంటి పరిస్దితుల్లో శుభం సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు ప్రకటించిన సమంత.. ఈ మూవీని ఆదరించి, తన ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరింది. ఈ సినిమాలోని ట్రైలర్‌లో సమంత కనిపించడంతో ఆమెను వెండితెరపై చూడొచ్చని అంతా అనుకున్నారు. కానీ ఏదో 2, 3 సన్నివేశాలలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది సామ్. వాటిలోనూ పెద్దగా ఆకట్టుకోలేదు. అయినప్పటికీ కేవలం సమంత వల్లే శుభం సినిమాకు బజ్ వచ్చింది.

సమంత కారణంగానే శుభంకు క్రేజ్

రూరల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన శుభం చిత్రాన్ని దాదాపు 3.5 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించినట్లు ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి. టీజర్, ట్రైలర్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. దీని కారణంగా శుభం సినిమాకు థియేట్రికల్‌గా మంచి బిజినెస్ జరిగింది. ఈ సినిమాను నైజాంలో టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. మిగితా ప్రాంతాల్లో ఆయా ఏరియాల డిస్టిబ్యూటర్లు హక్కులు సంపాదించుకొన్నారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. సమంత నిర్మించి చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.4 కోట్ల షేర్.. రూ.8 కోట్ల గ్రాస్ వసూళ్లు రావాల్సి ఉంటుందని విలువ కట్టారు. తెలుగు రాష్ట్రాల్లో 300 స్క్రీన్లు, వరల్డ్ వైడ్‌గా 500 స్క్రీన్లలో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

Take a Poll

శుభం ఏ ఓటీటీలో అంటే

విడుదలై 24 గంటలు గడవకముందే ఈ సినిమాను ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూస్తామా? అని ఆ సెక్షన్ లవర్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ వివరాలు పరిశీలిస్తే.. శుభం సినిమా థియేట్రికల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. సాధారణంగా థియేటర్‌లో రిలీజైన నాలుగు నుంచి ఐదు వారాల తర్వాతే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలన్నది నిబంధన. దీని ప్రకారం జూన్ రెండో వారంలో శుభం మూవీ ఓటీటీలో రిలీజ్ కానుంది. అయితే థియేట్రికల్ రన్‌ను బట్టి ఇది ఆలస్యం కావొచ్చు, లేదా ముందుకు జరగొచ్చు. శుభం ఓటీటీ రిలీజ్‌పై త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X