Vikrant Rona OTT: సుదీప్ కెరీర్ బిగ్గెస్ట్ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎందులో అంటే?

కన్నడ స్టార్ హీరో సుదీప్ నటించిన మూవీ విక్రాంత్ రోనా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కేవలం కన్నడ ఇండస్ట్రీలోనే కాకుండా ఈ సినిమా తెలుగు తమిళ్ హిందీ మలయాళం భాషల్లో కూడా భారీగానే విడుదలయ్యింది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమాకు సుదీప్ ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. ఇక అనుకున్నట్లు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడికి అయితే తెలుగు బయ్యర్లకు మంచి లాభాలను అందించింది.

ఎంతో కాలంగా తెలుగులో కూడా మంచి గుర్తింపు అందుకోవాలని ప్రయత్నం చేస్తున్న సుదీప్ కు విక్రాంత్ రోనా సినిమాతో మంచి గుర్తింపున అయితే అందుకున్నాడు. ఇక ఈ సినిమా ఓటీటీ లో ఎప్పుడు వస్తుంది అనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు వెలబడుతున్నాయి. అసలైతే గత వారంలోనే ఈ సినిమా ఓటీటీ లోకి రావాల్సింది అని కానీ వివిధ కారణాల వలన అగ్రిమెంట్ మారడంతో మరి కొంత ఆలస్యంగా ఓటీటీ లోకి వస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో నిర్మాతలకు ఓటీటీ ద్వారా కూడా మంచి ప్రాఫిట్ అయితే దక్కింది.

Successful film Vikram Rona OTT streaming date details

సెప్టెంబర్ 2వ తేదీన ZEE5లో విక్రాంత్ రోనా ప్రీమియర్ ప్రదర్శించనున్నారు. ZEE5 ఇంకా అదే విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు, అయితే ఈ చిత్రం సెప్టెంబర్ 2 నుండి ప్లాట్‌ఫారమ్‌పై ప్రసారం చేయడం దాదాపు ఖాయం. ఈ చిత్రం జూలై 28న థియేటర్లలో విడుదలైంది. దాదాపు 5 వారాల తర్వాత, ఇది దాని OTT స్ట్రీమింగ్ భాగస్వామిలో ప్రీమియర్ చేయబడుతోంది.
విక్రాంత్ రోనా అద్భుతమైన మేకింగ్ వాల్యూస్ తో తెరకెక్కింది.

యాక్షన్ ప్రియులకు కూడా మంచి కిక్ ఇచ్చింది ఈ సినిమా. ఇందులో కిచ్చా సుదీప్, నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించగా.. నిరూప్ భండారి దర్శకత్వం వహించారు. ఇక విక్రాంత్ రోనా సక్సెస్ కావడంతో ఇదే సినిమాకు మళ్ళీ సీక్వెల్ కూడా రాబోతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పటివరకు చిత్ర యూనిట్ సభ్యులు ఆ విషయంపై పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు కానీ త్వరలోనే సుదీప్ మాత్రం మళ్లీ ఫ్రాంచైజ్ గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ అయితే వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X