OTTలోకి సైలెంటుగా వచ్చేసిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్... స్ట్రీమింగ్ ఎందులో అంటే?
సినిమా లవర్స్ కు ఈ వారం విజయ్ దేవరకొండ, సమంత నటించిన ఖుషి సినిమాథియేటర్లో ఉండగా... ఓటీటీ వేదికగా ఎన్నో సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఇక ఓటీటీ కంటెంట్ అయితే ఇంట్లో కూర్చొని ఎంచక్కా చూసేయొచ్చు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ అయితే మరి మంచిది.. ఇంటిల్లిపాది కలిసి ఇంట్లోనే చూసి ఎంజాయ్ చెయొచ్చు. ఇక ఓ క్రైమ్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చడి చప్పుడు లేకుండా సైలెంటుగా ఓటీటీలోకి వచ్చి సందడి చేస్తోంది. ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వారం వారం ఓటీటీ వేదికగా ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. కొన్ని సినిమాలు ముందు చెప్పి వస్తుంటాయి...మరికొన్ని సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చి.. సైలెంటుగా ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చేస్తాయి. అందులో ఈ వారం చడి చప్పుడు లేకుండా ఓ సినిమాలో ఓటీటీ లోకి వచ్చి సందడి చేస్తోంది. క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన నారాయణ అండ్ కో సినిమా ఇప్పుడు ఓటీటీ వేదిక గా రిలీజ్ ఆకట్టుకుంటోంది.

'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన నటుడు సుధాకర్ కోమాకుల. ఆయన నటింటిన చిత్రం 'నారాయణ అండ్ కో'. ఈ మూవీ జూన్ 30వ తేదీన థియేటర్లోకి వచ్చింది. పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా పతాకాలపై పాపిశెట్టి బ్రదర్స్ సహకారంతో సుధాకర్ ఈ మూవీని నిర్మించారు. శ్రీనివాస్ గొర్రిపూడి ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు. చిన పాపిశెట్టి ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
నారాయణ అండ్ కో... 'ది తిక్కల్ ఫ్యామిలీ' ట్యాగ్ లైన్ తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చుట్టూ తిరిగే కథతో ఫన్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ఎంటర్‌టైనింగ్ గా ఉంటుంది. మధ్య తరగతి కుటుంబాన్ని లీడ్ చేసే యజమాని నారాయణ పాత్రలో దేవీ ప్రసాద్ ప్రేక్షకులను తనదైన శైలిలో అలరించాడు. అతని భార్య పాత్రలో సీనియర్ నటి ఆమని నటించగా... కొడుకు పాత్రలో సుధాకర్ నటించాడు.

'నారాయణ అండ్ కో' చిత్రంలో పూజా కిరణ్, యామిని, జయ్‌కృష్ణ, సప్తగిరి, అలీరెజా, శివ, రాగిణి, అనంత్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి, డాక్టర్ జోస్యభట్ల, నాగవంశి సంగీతం అందించారు. ఇక ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ వేదికగా రిలీజ్ అయి ఆకట్టుకుంటోంది.

జూన్ 30న రిలీజ్ అయిన ఈ మూవీ దాదాపు రెండు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. అనుకోకుండా ఎదురైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు ఓ కుటుంబం చేసిన తింగరి పనులే 'నారాయణ అండ్ కో' సినిమా మెయిన్ స్టోరీ అని అర్ధం అవుతుంది. మీరు గనుక థియేటర్లో ఈ సినిమా మిస్ అయితే.. ఓటీటీలో ఫ్యామిలీతో కలిసి చూసేయొచ్చు.


Click it and Unblock the Notifications











