ఓటీటీలోకి కేజీఎఫ్ రేంజ్ తెలుగు మూవీ.. ఈ మాస్ సినిమా ఎందులో వస్తుందంటే!

సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను దక్కించుకునేందుకు చాలా కాలంగా కష్టపడుతోన్నాడు టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు. కెరీర్ ఆరంభంలోనే విభిన్నమైన చిత్రాలతో మెప్పించిన అతడు.. ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్నాడు. ఇలా ఇటీవలే ఈ టాలెంటెడ్ హీరో 'హరోం హర' (Harom Hara) అనే మూవీ చేశాడు.

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు నటించిన ఊరమాస్ మూవీనే 'హరోం హర'. జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించిన ఈ సినిమా కుప్పం ఏరియా బ్యాగ్‌డ్రాప్‌తో 1980 నాటి కథతో తెరకెక్కింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీని నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. దీంతో ఈ మూవీని మే 31న రిలీజ్ చేశారు.

Sudheer Babu Starrer Harom Hara Movie Digital Streaming Details Revealed

సుధీర్ బాబు హీరోగా నటించిన 'హరోం హర' సినిమాపై ఉన్న అంచనాలకు అనుగుణంగానే గ్రాండ్‌గా తీసుకు వచ్చారు. కానీ, ఈ చిత్రానికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. కానీ, ఆ తర్వాత ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్లలోకి రప్పించడంలో విఫలం అయింది. ఫలితంగా ఈ సినిమా నష్టాలతోనే రన్‌ను ముగించాల్సి వచ్చింది.

ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'హరోం హర' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు పోటీ కూడా భారీగానే ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను మంచి రేటుకు దక్కించుకుంది. కానీ, ఈ సినిమా స్ట్రీమింగ్ విషయంలో మాత్రం అమెజాన్ సంస్థ ఎలాంటి ప్రకటననూ ఇప్పటి వరకూ చేయలేదు.

Sudheer Babu Starrer Harom Hara Movie Digital Streaming Details Revealed

సుధీర్ బాబు హీరోగా చేసిన 'హరోం హర' సినిమా మే 31 తేదీన విడుదలైంది. అయితే, ప్రేక్షకుల మెప్పును ఇది పొందలేకపోవడంతో వీలైనంత త్వరగా ఓటీటీలోకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ చిత్రం ఇప్పటికీ స్ట్రీమింగ్‌కు రాలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం జూలై రెండో వారంలో ఇది స్ట్రీమింగ్ అవబోతుందని తెలిసింది. దీనిపై ఈ రెండు రోజుల్లోనే ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఇదిలా ఉండగా.. 'హరోం హర' సినిమాను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జీ నాయుడు నిర్మించారు. ఇందులో మాళవిక శర్మ హీరోయిన్‌గా నటించగా.. సునీల్, జయప్రకాశ్ కీలక పాత్రలు చేశారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఈ మూవీని 'తెలుగు కేజీఎఫ్' అంటూ కొందరు సినీ విమర్శకులు పేర్కొన్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X