ఓటీటీలోకి తెలుగు కేజీఎఫ్ మూవీ.. ఈ ఊరమాస్ సినిమాను ఎక్కడ చూడాలంటే!
తెలుగు సినిమా పరిశ్రమలో ఈ మధ్య కాలంలో ఊరమాస్ స్టోరీలతో ఎన్నో సినిమాలు రూపొందుతోన్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల అంచనాలను అందుకుని సక్సెస్ అవుతున్నాయి. దీంతో ఇదే తరహాలో మరిన్ని చిత్రాలు చేయడానికి ప్రయత్నాలు జరుతున్నాయి. అలా ఇటీవలే విడుదలైన హై రేంజ్ యాక్షన్ సినిమానే 'హరోం హర' (Harom Hara).
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు సుధీర్ బాబు నటించిన ఊరమాస్ సినిమానే 'హరోం హర'. జ్ఞానసాగర్ ద్వారక రూపొందించిన ఈ మూవీ కుప్పం ఏరియా నేపథ్యంతో 1980 నాటి కథతో వచ్చింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఆరంభంలోనే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే దీని నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. దీంతో ఈ మూవీని మే 31న గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

అంచనాలకు అనుగుణంగానే సుధీర్ బాబు హీరోగా చేసిన 'హరోం హర' సినిమాను గ్రాండ్‌గా తీసుకు వచ్చారు. కానీ, ఈ సినిమాకు ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినా మంచి ఓపెనింగ్స్ అందుకుంది. కానీ, ఆ తర్వాత ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్లలోకి రప్పించడంలో ఇది సక్సెస్ కాలేదు. ఫలితంగా ఈ సినిమా నష్టాలతోనే రన్‌ను ముగించి పరాజయం పాలైంది.
కేజీఎఫ్ రేంజ్ ఎలివేషన్స్‌తో రూపొందిన 'హరోం హర' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు పోటీ కూడా భారీగానే ఏర్పడింది. అందుకు అనుగుణంగానే తెలుగు ఓటీటీ దిగ్గజం ఆహా వీడియో సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను మంచి ధరకు దక్కించుకుంది. కానీ, ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో 'హరోం హర' స్ట్రీమింగ్‌పై ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

'హరోం హర' సినిమా స్ట్రీమింగ్‌పై ఆహా సంస్థ తాజాగా ప్రకటన చేసింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేసి.. ఈ చిత్రాన్ని జూలై 11 నుంచే అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు అందులో ప్రకటించింది. అంతేకాదు 'బలవంతుడికి ఆయుధం అవసరం.. బలహీనుడికి ఆయుధమే బలం' అంటూ ఓ మాస్ డైలాగ్‌ను కూడా షేర్ చేసింది. దీంతో ఈ చిత్రం కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా.. సుధీర్ బాబు - జ్ఞానసాగర్ ద్వారక కాంబినేషన్‌లో రూపొందిన 'హరోం హర' సినిమాను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జీ నాయుడు నిర్మించారు. ఇందులో మాళవిక శర్మ హీరోయిన్‌గా నటించగా.. సునీల్, జయప్రకాశ్ కీలక పాత్రలు చేశారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











