twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Hunt Movie OTT: రెండు వారాలకే ఓటీటీలోకి.. సుధీర్ బాబు మూవీ ఎందులో వస్తుందంటే!

    |

    సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తూ సరైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు. కెరీర్ ఆరంభంలోనే తన యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న మంచి మంచి చిత్రాలతో మెప్పించిన అతడు.. హిట్లను మాత్రం పెద్దగా సొంతం చేసుకోలేదు. అయినప్పటికీ ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్నాడు. చాలా కాలంగా భారీ విజయం కోసం వేచి చూస్తోన్న సుధీర్ బాబు గత వారమే 'హంట్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

    జబర్ధస్త్ రీతూ చౌదరి హాట్ వీడియో వైరల్: తండ్రి చనిపోయిన వారానికే ఇలాంటివా!జబర్ధస్త్ రీతూ చౌదరి హాట్ వీడియో వైరల్: తండ్రి చనిపోయిన వారానికే ఇలాంటివా!

    సుధీర్ బాబు ప్రధాన పాత్రలో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'హంట్' మూవీ ఎన్నో అంచనాలతో విడుదలైంది. కానీ, దీనికి ఆశించిన రీతిలో టాక్ కానీ, రివ్యూలు కానీ రాలేదు. ఫలితంగా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల నుంచి స్పందన కరువైంది. మొదటి రోజే దీనికి ఓపెనింగ్స్ ఆశించిన రీతిలో రాకపోగా.. షాకింగ్ రిపోర్టులు దక్కాయి. ఇలా ఆ తర్వాత కూడా కలెక్షన్లు కూడా చెప్పుకోదగ్గ విధంగా రావడం లేదు. దీంతో ఈ సినిమా ప్రదర్శితం అవుతోన్న థియేటర్లు అన్నీ ప్రేక్షకులు లేక వెలవెలబోతోన్నాయి. దీంతో ఈ సినిమా మనుగడ వారం లోపే కష్టంగా మారిపోయింది.

    Sudheer Babu Starrer Hunt Movie Streaming On Amazon Prime From February 10th

    థియేటర్లలో పెద్దగా సందడి చేయలేకపోయిన సుధీర్ బాబు 'హంట్' మూవీని అనుకున్న సమయానికి కంటే ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను విడుదలైన రెండు వారాలకే అంటే ఫిబ్రవరి 10వ తేదీ నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ చేయబోతున్నారని తాజాగా తెలిసింది. ఈ మూవీ హక్కులు కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ మేరకు అధికారిక ప్రకటనను ఈ రెండు రోజుల్లోనే విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.

    Keerthy Suresh నిజమైన బాయ్‌ఫ్రెండ్ వివరాలు లీక్.. అతడి బ్యాగ్రౌండ్ తెలిస్తే.. రిసార్టులో దొరకడంతోనే!Keerthy Suresh నిజమైన బాయ్‌ఫ్రెండ్ వివరాలు లీక్.. అతడి బ్యాగ్రౌండ్ తెలిస్తే.. రిసార్టులో దొరకడంతోనే!

    సుదీర్ఘ కాలంగా భారీ విజయం కోసం వేచి చూస్తోన్న సుధీర్ బాబు నటించిన తాజా చిత్రమే 'హంట్'. మహేశ్ సూరపనేని తెరకెక్కించిన ఈ మూవీలో శ్రీకాంత్, భరత్ (ప్రేమిస్తే ఫేం) కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీని భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వీ ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. దీనికి గిబ్రాన్ సంగీతం అందించాడు.

    English summary
    Sudheer Babu Did Hunt Movie Under Mahesh Surapaneni Direction. This Movie Streaming On Amazon Prime From February 10th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X