Maama Mascheendra OTT: 2 వారాలకే ఓటీటీలోకి మహేశ్ బావ మూవీ.. ఏ సినిమాకూ ఇలా జరగలేదుగా!
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నాడు టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు. కెరీర్ ఆరంభంలోనే మంచి మంచి చిత్రాలతో మెప్పించిన అతడు.. హిట్లను మాత్రం పెద్దగా రాబట్టలేకపోతోన్నాడు. అయినప్పటికీ ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్నాడు.
ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక ఇబ్బంది పడుతోన్న సుధీర్ బాబు ఇటీవలే 'మామా మశ్చీంద్రా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అతడు ట్రిపుల్ రోల్ చేసిన ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు, దర్శకుడు హర్షవర్ధన్ తెరకెక్కించాడు. క్రేజీ కాన్సెప్టుతో ఈ సినిమా రూపొందింది. దీంతో ఆరంభంలోనే ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని అక్టోబర్ 6న విడుదల అయింది.

డిఫరెంట్ కాన్సెప్టుతో రూపొందిన 'మామా మశ్చీంద్రా' (Maama Mascheendra) మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో మొదటి రోజే ఈ సినిమాకు ప్రేక్షకుల స్పందన కరువైంది. ఫలితంగా చాలా ప్రాంతాల్లో జీరో షేర్‌కే ఇది పరిమితం అయింది. ఆ తర్వాత కూడా ఈ చిత్రం అంతగా తేరుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ ముందు ఇబ్బంది పడుతోంది.
సుధీర్ బాబు (Sudheer Babu) మూడు పాత్రల్లో నటించిన 'మామా మశ్చీంద్రా' మూవీపై ఆరంభంలోనే మంచి హైప్ క్రియేట్ అయింది. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు మంచి పోటీనే ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ మంచి ధరకు కొనుగోలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ఇక, థియేటర్లలో పట్టుమని మూడు రోజులు కూడా సందడి చేయని 'మామా మశ్చీంద్రా' (Maama Mascheendra) మూవీని అనుకున్న దానికంటే ముందుగానే స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే దీన్ని థియేటర్లలోకి వచ్చిన రెండు వారాలకే అంటే అక్టోబర్ 20 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అమెజాన్ సంస్థ ప్రకటించింది.

ఈ మధ్య కాలంలో ప్రతి సినిమా కనీసం నాలుగు వారాల తర్వాతనే ఓటీటీలోకి వస్తుంది. కానీ, సుధీర్ బాబు నటించిన 'మామా మశ్చీంద్రా' మాత్రం రెండు వారాలకే స్ట్రీమింగ్ కాబోతుంది. దీంతో అత్యంత త్వరగా ఓటీటీలోకి వచ్చిన చిత్రాల జాబితాలో ఇది కూడా చేరిపోయింది. మరి అమెజాన్ ప్రైమ్‌లో అయినా ఈ సినిమాకు మంచి స్పందన వస్తుందా లేదా చూడాలి.
ఇదిలా ఉండగా.. సుధీర్ బాబు - హర్షవర్ధన్ కాంబినేషన్‌లో రూపొందిన 'మామా మశ్చీంద్రా' మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోషన్ నిర్మించారు. ఇందులో ఈషా రెబ్బా, మృణాళిని హీరోయిన్లుగా.. రవి, హర్షవర్ధన్, రాజీవ్ కనకాల తదితరలు కీలక పాత్రల్లో నటించారు. చైతన్ భరద్వాజ్, ప్రవీణ్ మ్యూజిక్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











