సుధీర్ బాబు సినిమాకు ఓటీటీ కష్టాలు... హరోం హరకు హ్యాండ్ ఇచ్చిన రెండు ఓటీటీ సంస్థలు

By Lekhaka

నవ దళపతి సుధీర్ బాబు తాజా చిత్రం హరోం హరకు ఓటిటి కష్టాలు తప్పట్లేదు. థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కనీసం ఓటిటి మూవీ లవర్స్ నైనా మెప్పిస్తుందా అని అనుకుంటే రిలీజ్ చేయాల్సిన రెండు ఓటిటి సంస్థలు హ్యాండ్ ఇచ్చాయి అనే వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. . అసలు హరోం హర మూవీ ఓటిటీ స్ట్రీమింగ్ విషయంలో ఏం జరుగుతోంది? అనే విషయంపై ఒక లుక్కేద్దాం పదండి.

ఇటీవల నవ దళపతిగా బిరుదును పెట్టుకున్న టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు. ఆయన హీరోగా నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ హరోం హర. జ్ఞాన సాగర్ ద్వారక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో మాళవిక శర్మ హీరోయిన్ పాత్రను పోషించింది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మాత సుమంత్ జి నాయుడు నిర్మించారు.

Sudheer Babu s latest movie Harom Hara Movie OTT Release Delayed

ఇక మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లాంటి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై గట్టిగానే హైప్ పెంచింది. ప్రమోషన్స్ కూడా భారీగానే నిర్వహించడంతో డార్క్ థీమ్ తో వచ్చిన ఈ మూవీ సుధీర్ బాబు కెరీర్ ని టర్న్ చేస్తుందని అందరూ అనుకున్నారు. మంచి బజ్ తో భారీ అంచనాల మధ్య జూన్ 14న హరోం హర థియేటర్లలోకి వచ్చింది. అయితే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద చెప్పుకోదగ్గ కలెక్షన్లు మాత్రం రాబట్ట లేకపోయింది.

ముఖ్యంగా సినిమాలో ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలపైనే దర్శకుడు కాన్సెంట్రేట్ చేయడం చాలా మందికి నచ్చలేదు. ఇక ఓవరాల్ గా చూస్తే సినిమా యావరేజ్ అని సుధీర్ బాబు అభిమానులు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే హరోం హర మూవీని జూలై 11న ఓటిటిలో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. రెండు తెలుగు ఓటిటి ప్లాట్ఫామ్స్ ఈ మూవీ రైట్స్ ను దక్కించుకున్నాయి.

ఆహాతో పాటు ఈటీవీ విన్ కూడా హరోం హర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకోగా, రెండు ఓటీటీల్లోనూ జూలై 11న ఒకేసారి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కూడా. కానీ ఆశ్చర్యకరంగా జూలై 11న ఈ రెండు ఓటీటీల్లో కనీసం ఒక్కదాంట్లో కూడా హరోం హర కనిపించకపోవడం సుధీర్ బాబు అభిమానులను నిరాశపరిచింది. కనీసం మూవీని ఆలస్యంగా స్ట్రీమింగ్ చేస్తారా? లేదంటే ఇంకా టైం పడుతుందా అన్న అప్డేట్ ను కూడా ఈ రెండు ఓటిటి ప్లాట్ఫామ్స్ మూవీ లవర్స్ కి ఇవ్వలేదు.

Sudheer Babu s latest movie Harom Hara Movie OTT Release Delayed

దీంతో సోషల్ మీడియా వేదికగా ఈ మూవీ కోసం ఎదురు చూసిన ఆడియన్స్ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే హరోం హర ఓటిటి స్ట్రీమింగ్ పై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మూవీని అధికారికంగా ప్రకటించిన రోజున కాకుండా నెక్స్ట్ డే రిలీజ్ చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా నవదీప్ లవ్ మౌళి సినిమా విషయంలో కూడా ఇలాగే చేశారు. మరి అందరూ అనుకుంటున్నట్టుగా హరోం హర మూవీ జూలై 12న ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా అనేది చూడాలి.

More from Filmibeat

Read more about: sudheer babu harom hara ott
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X