Sudigali Sudheer: అల్లు అరవింద్ ఆహా ఆఫర్.. సుడిగాలిలా పెరిగిన సుధీర్ రెమ్యునరేషన్!
తెలుగు బుల్లితెర ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో మంచి గుర్తింపును అందుకున్న కమెడియన్స్ లలో సుడిగాలి సుదీర్ ఒకరు. అతను కేవలం ఒక టెలివిజన్ యాంకర్ గానే కాకుండా జబర్దస్త్ ద్వారా అంతకుముందే మంచి కమెడియన్ గా కూడా గుర్తింపు అందుకుంటూ వచ్చాడు. అయితే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సుధీర్ ఒక కొత్త షో స్టార్ట్ చేయబోతున్నట్లు ఒక టాక్ వచ్చింది. ఇక అల్లు అరవింద్ అతనికి ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు. ఇక ఆ కామెడీ షో కోసం భారీ స్థాయిలో పారితోషికం కూడా అందుతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

జబర్దస్త్ ద్వారా
జబర్దస్త్ ద్వారా మంచి ట్రాక్ లోకి వచ్చిన సుడిగాలి సుదీర్ మొదట్లో రైటర్ గా కొనసాగాడు. ఇక తర్వాత కొన్నాళ్లకు జబర్దస్త్ రేంజ్ పెరగడంతో తనే లీడర్ గా సరికొత్తగా కెరీర్ ను సెట్ చేసుకున్నాడు. ఒకవైపు జబర్దస్త్ చేస్తూనే మరొకవైపు సినిమాల్లో కూడా నటించాడు. అలాగే ఈటీవీలోని మరికొన్ని కామెడీ షోలలో కూడా అతను సొంతంగా చేసుకుంటూ వెళ్ళాడు.

ఆ షోలతో కూడా
ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా కూడా సుడిగాలి సుధీర్ కి మంచి గుర్తింపు లభించింది. అంతకుముందే ఈటీవీలో మొదలైన డాన్స్ షో డీలో కూడా సుదీర్ కొన్నాళ్లు కొనసాగిన విషయం తెలిసిందే. ఆ షో ద్వారా అతను అందరికంటే ఎక్కువ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటూ కెరీర్ మొత్తం కూడా సెట్ చేసేసుకున్నాడు. అదేవిధంగా అప్పుడప్పుడు ఈటీవీలో ఫెస్టివల్స్ సెలబ్రేషన్ షోలలో కూడా అతను హైలెట్ అవుతూ వచ్చాడు.

రూమర్స్ ఎన్ని వచ్చినా..
ఇక సుడిగాలి సుదీర్ హఠాత్తుగా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసినప్పటినుంచి అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. అలాగే ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి కూడా బయటకు రావడంతో పలు విభేదాలు వచ్చినట్లు కూడా ఎన్నో కథనాలు సోషల్ మీడియాలో వినిపించాయి. అయితే ఆ విషయాలను సుదీర్ పెద్దగా పట్టించుకోలేదు సైలెంట్ గా సినిమాలతో కొనసాగుతూ వెళుతున్నాడు.

ఆహా కామెడీ షో
చివరగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో సుధీర్ పండుగాడు అనే సినిమా చేశాడు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయింది. ఇక ప్రస్తుతం సుదీర్ లిస్టులో రెండు మూడు సినిమాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. కానీ అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఈ తరుణంలోనే అతను ఆహా కామెడీ స్టాక్ ఎక్స్ చేంజ్ అనే షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్టాండప్ కామెడీ షో గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ షోలో అనిల్ రావిపూడి కూడా ప్రత్యేక జడ్జిగా కనిపించబోతున్నాడు.

రెమ్యునరేషన్ ఎంతంటే?
ప్రత్యేకంగా అల్లు అరవింద్ పిలిచి మరి సుడిగాలి సుదీర్ కు ఈ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆహా కామెడీ షోలో చేయడానికి సుధీర్ కు భారీగా రెమ్యునరేషన్ ఇచ్చినట్లు టాక్. ఒకప్పుడు జబర్దస్త్ ద్వారా సుధీర్ ఒక ఎపిసోడ్ కు దాదాపు రెండు లక్షలు తీసుకుంటూ వచ్చాడు. ఇక ఇప్పుడు ఆహా కామెడీ స్టార్స్ కోసం అతను అంతకంటే ఎక్కువ స్థాయిలోనే మూడు లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. షో మరింత క్లిక్ అయినా కూడా అతని రేంజ్ పేరుగుతుంది. మరి ఈ షో ద్వారా ఎలాంటి లాభాలను అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











