ఆ బ్యూటీపై కన్నేసిన సుడిగాలి సుధీర్.. కబ్జా చేసేస్తా అంటూ డబుల్ మీనింగ్‌లో!
ఒకప్పుడంటే ప్రసార మాధ్యమాలు లేకపోవడంతో చాలా మంది టాలెంట్ మరుగునపడిపోయేది. అయితే, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితులు లేవు. అందుకే ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్లు వెలుగులోకి వచ్చారు. అలాంటి వారిలో సుడిగాలి సుధీర్ ఒకడు. అసాధారణ టాలెంట్లతో సత్తా చాటుతోన్న అతడు.. ఎవరూ ఊహించని రీతిలో ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జబర్ధస్త్ బ్యూటీపై సుధీర్ కన్నేశాడు. అసలేం జరిగింది. ఆ పూర్తి వివరాలను మీరే చూడండి!
బుల్లితెరపై ఆల్‌రౌండర్
మేజీషియన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన సుడిగాలి సుధీర్.. అనుకోకుండా జబర్ధస్త్ షోలోకి అడుగు పెట్టాడు. అలా వచ్చిన కొత్తలోనే అతడు తనదైన హాస్యంతో అందరినీ నవ్వించాడు. దీంతో షో నిర్వహకులు అతడిని టీమ్ లీడర్‌ను చేశారు. అలాగే, రష్మీతో లవ్ అని కలరింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత నటుడిగా, యాంకర్‌గా, డ్యాన్సర్‌గా అలరించి సుధీర్ ఆల్‌రౌండర్ అనిపించుకున్నాడు.

సినిమాల్లోకి.. హీరోగానూ
తెలుగు బుల్లితెరపై చాలా కాలం పాటు ప్రభావాన్ని చూపించిన సుడిగాలి సుధీర్.. చాలా చిత్రాల్లో మంచి పాత్రలను పోషించాడు. ఈ క్రమంలోనే హీరోగా 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీమంకీస్' వంటి సినిమాలు చేశాడు. కానీ, అతడికి ఇవేమీ విజయాన్ని అందించలేదు. కానీ, 'గాలోడు' చిత్రంతో తొలి సక్సెస్‌ను చూసిన సుడిగాలి సుధీర్.. మరింత ఉత్సాహంతో ముందుకెళ్తున్నాడు.
ఇప్పుడా మూవీతో రెడీ
'గాలోడు' సినిమాతో సత్తా చాటిన సుడిగాలి సుధీర్ ఫుల్ ఖుషీగా ముందుకు వెళ్తున్నాడు. ఇలా ఇటీవలే 'కాలింగ్ సహస్ర' అనే చిత్రంతో వచ్చాడు. కానీ, ఈ మూవీ అనుకున్న విధంగా సక్సెస్ సాధించలేదు. ఇక, ఇప్పుడు సుడిగాలి సుధీర్ 'GOAT' అనే సినిమాలో నటిస్తున్నాడు. అది త్వరలోనే విడుదల కాబోతుంది. దీని తర్వాత అతడు మళ్లీ గ్యాప్ తీసుకోబోతున్నాడు.

సర్కార్‌గా సందడి చేసి
బుల్లితెరపై చాలా రోజుల పాటు కనిపించని సుడిగాలి సుధీర్.. సినిమాలనే ఎక్కువగా చేసుకుంటూ వెళ్లాడు. అలాంటిది ఇప్పుడు బుల్లితెరపైకి రీఎంట్రీ ఇచ్చేసి 'ఫ్యామిలీ స్టార్స్' అనే షో చేస్తున్నాడు. దీనితో పాటు ఆహా ఓటీటీలో 'సర్కార్ 4' అనే గేమ్ షోను కూడా హోస్ట్ చేస్తున్నాడు. ఇది మాత్రం ఎవరూ ఊహించని రీతిలో ఆదరణను అందుకుంటూ సాగిపోతోంది.
సక్సెస్ పార్టీ వాళ్లంతా
ఆహాలో ప్రసారం అవుతోన్న 'సర్కార్' నాలుగో సీజన్‌ను సుడిగాలి సుధీర్ అద్భుతమైన హోస్టింగ్‌తో నడిపించాడు. దీంతో ఆ ఓటీటీ నిర్వహకులు సక్సెస్ పార్టీ అనే పేరుతో చివరి ఎపిసోడ్‌ను ప్లాన్ చేసింది. దీనికి బుల్లితెరపై ఫేమస్ అయిన ఎంతో మంది సెలెబ్రిటీలు హాజరయ్యారు. అలాగే, నిహారిక కొణిదెల కూడా వచ్చింది. ఈ ప్రోమో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది.

ఆ ల్యాండ్ కబ్జా చేసేస్తా
'సర్కార్ సక్సెస్ పార్టీ' ఎపిసోడ్‌లో భాగంగా వచ్చిన వర్ష.. యాదమ్మ రాజుతో కలిసి ఓ పాటకు డ్యాన్స్ చేసింది. అది చూసిన ఇమాన్యూయేల్ తెగ ఫీలైపోయాడు. ఆ తర్వాత 'నాకో ల్యాండ్ ఉంది. కానీ అది వేరే వాడి పేరు మీద ఉంది' అని కామెంట్ చేశాడు. దీంతో సుధీర్ 'మీ ఇద్దరికీ వద్దంటే నేను కబ్జా చేస్తా' అంటూ వర్షపై డబుల్ మీనిండ్ డైలాగ్ వదిలాడు.


Click it and Unblock the Notifications











