సడన్‌గా OTTలోకి వచ్చేసిన రీసెంట్ సస్పెన్స్ థ్రిల్లర్.. డేర్ ఉంటే అందులో చూసేయండి!
ఈ మధ్య కాలంలో అనేక సినిమాలు ఓటీటీ వేధికగా స్ట్రీమింగ్ అవుతూ ఓటీటీ ప్రియులను తెగ అలరిస్తున్నాయి. అనేకమైన ఆప్షన్లు ఉండేలాగా చాలానే చిత్రాలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. థియేటర్లకు వెళ్లే సమయం లేని వాళ్లు, వెళ్లలేని వాళ్లంతా ఇక్కడే ఉండి ఓటీటీల్లో సినిమాలు చూసేస్తున్నారు. అయితే అలాంటి వాళ్ల కోసమే అన్నట్లుగా ఓ అద్బుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. సరిగ్గా నెల రోజుల క్రితమే విడుదల అయిన సుడిగాలి సుధీర్ కాలింగ్ సహస్ర సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఆ సినిమాను ఎక్కడ చూడాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జబర్దస్త్ కమెడియన్, మెజీషియన్ గా, యాంకర్ గా.. ఇలా అన్ని పనులు చేస్తూ తనలోని టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న సుడిగాలి సుధీర్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2017లో నేనోరకం సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఇతగాడు.. ఆ తర్వాత సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్, కోతల రాయుడు, వాంటెడ్ పండుగాడు, గాలోడు వంటి చిత్రాలతో వచ్చి ప్రేక్షకులను అలరించాడు. కానీ తాజాగా అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమానే కాలింగ్ సహస్ర.

షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ బ్యానర్‌పై విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించిన ఈ సినిమాకు అరుణ్ విక్కిరాలా దర్శకత్వం వహించాడు. అలాగే సుధీర్, డాలీషా, శివబాలాజీ మనోహరన్, రవితేజ నన్నిమాల వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ ఒకటో తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది. అయితే మొదటి నుంచి పాజిటివ్ టాక్ యే తెచ్చుకున్నప్పటికీ.. ఎక్కువ రోజులు మాత్రం థియేటర్లలో ఆడలేకపోయింది. ఇలా ఫ్లాప్ గా నిలిచిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వేధికగా ఈ సినిమా ఈరోజు నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి ఒకటో తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను మీరరు ఇప్పటి వరకు చూసి ఉండకపోతే కచ్చితంగా చూసేయండి. మీరు ఆశించిన స్థాయిలో లేకపోయినప్పటికీ కచ్చితంగా మీకో టైమ్ పాస్ అలరించడంలో మాత్రం కాలింగ్ సహస్ర కచ్చితంగా ముందే ఉంటుంది. బుల్లితెరపై తెగ సందడి చేసే సుడిగాలి సుధీర్ యాక్టింగ్ ఎలా ఉందో కూడా ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. సో ఇంకా ఎందుకు ఆలస్యం అమెజామ్ ప్రైమ్ వేధికలోకి వెళ్లి సినిమాను చూసేయండి.


Click it and Unblock the Notifications











