OTT ఓటీటీలోకి షారుక్, శ్రీదేవీ కూతుళ్ల మూవీ.. సుహనా, ఖుషీ కపూర్ సినిమా ఎక్కడ? ఎప్పుడు రిలీజ్ అంటే?
ఇండియాలో ఎంటర్‌టైనింగ్ ఇండస్ట్రీలో ఓటీటీలకు భారీ ఆదరణ దక్కుతున్నది. 2023 సంవత్సరంలో ఓటీటీ ప్రభావం ప్రేక్షకులపై ఎక్కువగానే పడింది. అలాంటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచేందుకు డిసెంబర్ నెల సిద్దమైంది. ఈ నెలలో షారుక్ ఖాన్, శ్రీదేవీ కూతుళ్లు నటించిన సినిమా ఓటీటీలో రిలీజ్ కానున్నది. ఆ మూవీతోపాటు ఇంకా ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయనే వివరాల్లోకి వెళితే..
2023 డిసెంబర్ నెలలో విభిన్నమైన కాన్సెప్ట్‌తో కూడిన సినిమాలు రిలీజ్ ముస్తాబవుతున్నాయి. ఈ నెలలో విడుదలవుతున్న చిత్రాల్లో ది ఆర్చీస్, ది ఫ్రీలాన్సర్: ది కన్‌క్లూజన్, ది క్రౌన్ సీజన్ 6 పార్ట్ 2, కడక్ సింగ్, బెర్లిన్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలు, సిరీస్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ది అర్చీస్ (The Archies) మూవీ విషయానికి వస్తే.. ఈ సినిమాకు పాపులర్ బాలీవుడ్ డైరెక్టర్ జోయా అఖ్తర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్చీస్ కామిక్ సిరీస్‌ను స్పూర్తిగా తీసుకొని ఈ సినిమాను రూపొందించారు. రివర్ డేల్ పార్క్‌లో చేపట్టిన మిషన్ కోసం తన స్నేహితులతో కలిసి చేసిన సాహసాలను ఆర్చీ ఆండ్రూస్ చెప్పబోతున్నారు. ఈ చిత్రంలో షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, శ్రీదేవీ కూతురు కుషీ కపూర్, అగస్త్య నంద, వెడంగ్ రైనా, మిహిర్ అహుజా, అదితి సైగల్, యువరాజ్ మెండా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 7వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నది.
ఓటీటీలో అత్యధిక మందిని ఆకర్షించిన వెబ్ సిరీస్ ది ఫ్రిలాన్సర్. డిస్నీస్టార్‌లో ప్రసారమైన ఈ వెబ్ సిరీస్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో చివరి సిరీస్ పార్ట్ 2ను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రముఖ రచయిత శిరీష్ థ్రోట్ రచించిన నవల ఏ టికెట్ టూ సిరియా ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. సిరియాలో చిక్కుకొన్న అమ్మాయిని రక్షించే మిషన్ నేపథ్యంగా ఈ వెబ్ సిరీస్ స్పై థ్రిల్లర్‌గా రూపొందింది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, సుశాంత్ సింగ్, జాన్ కొక్కెన్, సారా జేన్ డయాస్ తదితరులు నటించారు. ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 15వ తేదీన డిస్నీ+హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నది.

ప్రముఖ దర్శకులు అనిరుధ రాయ్ చౌదరీ దర్శకత్వం వహించిన కడక్ సింగ్ ఓటీటీలోకి రానున్నది. జాతీయ అవార్డు గ్రహీత, మీర్జాపూర్ ఫేమ్ పంకజ్ త్రిపాఠి, దూత్ ఫేమ్ పార్వతి తిరువోతు, సంజనా సాంఘీ నటించారు. ఆర్థిక నేరాల నేపథ్యంగా సాగే ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ జీ5 లో డిసెంబర్ 8వ తేదీన స్ట్రీమింగ్ కానున్నది.
దోపిడి నేపథ్యంగా సాగే మనీ హీస్ట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది. అదే తరహాలో సాగే వెబ్ సిరీస్ బెర్లిన్. పేరుమోసిన దొంగలతో దుర్మార్గంగా వ్యవహరించే దొంగలు కలిస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయం ఈ సిరీస్‌లో చూపించబోతున్నారు. పెడ్రో అలోన్సో పాత్రలో అండ్రెస్ డే ఫొనోలోసా కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











