OTTలోకి నెలకాకముందే సూపర్ హిట్ ఎమోషనల్ డ్రామా... ఎందులో చూడాలంటే?
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ సినిమా సిరీస్‌లు వస్తూనే ఉంటాయన్న సంగతి తెలిసిందే. అలానే థియేటర్లలో రిలీజైన సూపర్ హిట్ సినిమాలు కూడా అలరిస్తుంటాయి. తాజాగా థియేటర్లలో దగ్గర సూపర్ హిట్ రీసౌండ్‌తో ఆడియెన్స్‌ను అలరించిన ఓ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అవుతోంది. అదే సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల్న అలరిస్తూ ఎలాంటి రీసౌండ్ చేసిందో తెలిసిన విషయమే.ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. ఎప్పుడూ ఎక్కడ చూడాలో తెలుసుకుందాం.
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించి హీరోగా మారిన నటుడు సుహాస్. కలర్‌ఫొటో, రైటర్ పద్మభూషణ్ వంచి చిత్రాలో మంచి గుర్తింపు తెచ్చుకుని ఆడియెన్స్‌లో ఓ మార్కెట్‌ను క్రిియేట్ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా స్టోరీ సెలక్షన్లో వైవిధ్యతను బాగా చూపిస్తూ ఆకట్టుకుంటున్నారు. రీసెంట్గా ఆయన హీరోగా తెరకెక్కిన మరో చిత్రమే అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఈ హార్డ్ హిట్టింగ్ లవ్ యాక్షన్ చిత్రాన్ని దుశ్యంత్ కటికనేని తెరకెక్కించారు.

సినిమమాలో గోపరాజు రమణ, శివానీ నగారం, నితిన్ ప్రసన్న, స్వర్ణకాంత్, జదీప్ ప్రతాప్, వినయ్ మాధవ్, శరణ్య ప్రదీప్ నటించారు. శేఖర్ చంద్ర సంగీతం, వాజిద్ బేగ్ సినిమాటోగ్రఫీ అందించారు. కోదాటి పవన్ కల్యాణ్ ఎడిటర్‌గా వ్యవహరించారు. వెంకటేశ్ మహా సమర్పణలో నిర్మాత ధీరజ్ మొగిలినేని, బన్నీవాస్ నిర్మించారు.
ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‍తో అలరించింది. అంచనాలకు తగ్గట్టు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో రాణిస్తోంది. ప్రేక్షకుల మనసుల్ని గెలిచిందీ చిత్రం. కులవివక్షకు ప్రేమ కథ, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను జోడించి ఈ మూవీని చాలా చక్కగా ఎమోషనల్‌గా తెరకెక్కించారు. సమాజంలోని అంతరాలు, పరువు, ప్రేమ నేపథ్యంలో సాగే చిత్రమిది.

ప్రేమకథతో పాటు ఆత్మాభిమానం అనే అంశాన్నీ కూడా బలంగా చెప్పే ప్రయత్నాన్ని చిత్రంలో చేశారు. ఆడదాని వెంట పడటం కాదు, వెనక ఉండటం అంటే మగతనం, ఓ ప్రాణం భూమి మీదకి రావడానికి కూడా పది నెలలు పడుతుంది, కానీ అలాంటిది నిన్న కనిపించిన మనిషిని ఈ రోజు లేకుండా చేశావంటూ సాగే సంభాషణలు మనసుల్ని తాకాయి. ఇంకా చాలా విషయాల్ని సినిమాలో హార్డ్ హిట్టింగ్‌గా చూపించారు.
అయితే ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయినట్లు తెలుస్తోంది. మార్చి 1 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుందని ఓటీటీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రముఖ అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుందట. మరి మీరు థియేటర్లో ఈ సూపర్ హిట్ ఎమోషనల్ డ్రామా మూవీ మిస్ అయితే ఓటీటీలో చూసేయండి..


Click it and Unblock the Notifications











