OTT: ఆ ఫేమస్ ఓటీటీలోనే సుహాస్ అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది పైకి వచ్చిన వాళ్లు ఉన్నారు. అప్పట్లో చిరంజీవి, రవితేజ ఉంటే.. ఈ తరం వారిలో సుహాస్ ఉన్నారు. కమెడియన్ గా కెరియర్ స్టార్ట్ చేసి.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్నేహితుడి ఫ్రెండు పాత్రలో, విలన్ పాత్రలో నటిస్తూ... ఇప్పుడు హీరోగా నిలదొక్కుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే రైటర్ పద్మభూషన్ సినిమాతో హిట్ అందుకున్న ఈ కుర్ర హీరో.. ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డీసెంట్ టాక్ లభించుకున్న ఈ సినిమా ఓటీటీ వివరాలు బయటకు వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే....

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ సినిమా అంబాజీపేట మ్యారేజీ బ్యాండు. ఈ సినిమా శుక్రవారం అనగా ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే గురువారం (ఫిబ్రవరి 1) నాడే ఈ సినిమా పెయిడ్ ప్రిమియర్స్ వేశారు. దీంతో ఈ సినిమా చూసిన వాళ్లంతా బాగుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు సౌండ్ గట్టిగానే ఉందంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ పెడుతున్నారు.

Suhas Ambajipeta Marriage Band Movie Streaming on Aha OTT Here is The Details

ఇప్పటికే ఈ సినిమాపై స్టార్ హీరో విజయ్ దేవరకొండ రివ్యూ కూడా ఇచ్చేశారు. ఫస్టాఫ్ అయితే పగిలిపోయిందంటూ తన ట్విట్టర్ వేదికగా రివ్యూను రాసుకువచ్చాడు. అందరూ తప్పకుండా ఈ మూవీ చూడాల్సిన సినిమా అంటూ కితాబుఇచ్చాడు. ఇక ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగా.. మొదటి షో నుంచే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. సుహాస్ రైటర్ పద్మభూషన్ తర్వాత ఈ సినిమాతో మరో హిట్ కొట్టేలా ఉన్నాడని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. సుహాస్ హీరోగా నటించగా... శివానీ నగరం హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాను కొత్త దర్శకుడు దుశ్యంత్ తెరకెక్కించగా.. సుహాస్ అక్క పాత్రలో శరణ్య ప్రదీప్ కనిపించింది. జగదీష్, నితిన్ ప్రసన్న, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలో నటించారు. బన్నీ వాస్, దర్శకుడు వెంకటేష్ మహా సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మించగా.. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

Suhas Ambajipeta Marriage Band Movie Streaming on Aha OTT Here is The Details

అంబాజీపేట మ్యారెజ్ బ్యాండ్ చిన్న చిత్రం అయినప్పటికీ.. మంచి బజ్ నెలకొంది. దీంతో ఈ సినిమా డిజిటల్ ప్రిమియర్ హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రముఖ ఓటీటీ సంస్థ, తెలుగు కంటెంట్ అందించే ఆహా ఈ సినిమాను భారీ ధరకు ఓటీటీ హక్కులను కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఈ సినిమా త్వరలోనే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు వచ్చే రెస్పాన్స్ ను బట్టి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం.లేదంటే సినిమా రిలీజ్ అయిన 40 రోజులకు ఓటీటీలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు స్ట్రీమింగ్ కానుంది.

ఇక సుహాస్ నటించిన ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా విషయానికి వస్తే... మ‌నుషుల మ‌ధ్య అహం ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను సృష్టిస్తుందనే పాయింట్‌తో ఈ మూవీని దర్శకుడు దుశ్యంత్ చక్కగా తెరకెక్కించాడు. ఈ వారం టాలీవుడ్ లో పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు కాబట్టి... అంబాజీపేట మ్యారేజీ బ్యాండుకు మంచి కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజులో కలెక్షన్లు రాబడుతుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X