ఈ జనరేషన్‌‌లో పిల్లల్ని కనాలా? వద్దా? .. ఓటీటీలోకి సుహాస్ ఫ్యామిలీ డ్రామా, టైమ్ అండ్ డేట్ ఇదే!

భారతదేశం అభివృద్ధిలో దూసుకెళ్తున్నా , అగ్రరాజ్యాలకే పోటీ ఇచ్చేలా ఎదుగుతున్నా ఇప్పటికీ దేశంలో మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నారు. నిత్యావసర వస్తువులు, పెట్రోలియం, గ్యాస్ ధరలు రోజురోజుకు పెరుగుతున్న దశలో సగటు జీవి కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టమైపోయింది. అందుకే యువతీ, యువకులు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు. ఒకవేళ పెళ్లాడినా పిల్లల్ని కనడానికి టైం తీసుకుంటున్నారు. ఇందుకు ఎన్నో లెక్కలు, ఈక్వేషన్స్ .. ఈ దశలో ఒకే ఒక్క పొరపాటు ఒక మధ్య తరగతి వ్యక్తి జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పిందో వివరిస్తూ సుహాస్ నటించిన చిత్రమే జనక అయితే గనక. ఈ సినిమా ఓటీటీలోకి రావడానికి రంగం సిద్ధం చేసుకుంది.

కలర్ ఫోటో మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సుహాస్ తన ప్రతిభతో ఇక్కడి వరకు చేరుకున్నాడు. ఇతని చేతిలో ఏకంగా అరడజను సినిమాలు ఉన్నాయంటే ఇతని స్పీడ్‌ని అర్ధం చేసుకోవచ్చు. మినిమం గ్యారెంటీ, ఓటీటీలలో తనకంటూ ప్రత్యేక మార్కెట్ తెచ్చుకోవడంతో సుభాస్ చిన్న నిర్మాతల పాలిట కల్పవృక్షంలా మారాడు. ఈ క్రమంలో ఏకంగా టాలీవుడ్ బడా నిర్మాత దిల్‌రాజు బ్యానర్‌లోనే సినిమా చేసే రేంజ్‌కి చేరుకున్నాడు సుహాస్.

Suhas and sangeerthana vipin starrer janaka aithe ganaka ott release on November 8th

సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ జనక అయితే గనక. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, మురళీశర్మ, ప్రభాస్ శ్రీను, గోపరాజు రమణ తదితరులు నటించిన ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 12న రిలీజైన ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు, మంచి మౌత్ టాక్ కారణంగా ప్రేక్షకులు బాగానే ఆదరించారు.

తండ్రి (గోపరాజు రమణ) తీసుకొన్న తప్పుడు నిర్ణయం కారణంగా ఆర్థిక సమస్యలతో ఎదుగుబొదుగు లేకుండా ఉండిపోయామనే ఫీలింగ్‌తో ఉండే యువకుడు ప్రసాద్ (సుహాస్). వాషింగ్ మిషన్ కంపెనీలో పని చేస్తూ భార్య (సంగీర్తన), స్నేహితుడు, లాయర్ పత్తి కిషోర్ (వెన్నెల కిషోర్)లతో ఉన్నంతలో జీవితాన్ని లాగిస్తుంటాడు. తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇప్పట్లో పిల్లల్ని కనకూడదని ప్రసాద్ దంపతులు నిర్ణయం తీసుకొంటారు. బెడ్‌రూమ్‌లోనూ భార్యాభర్తలు జాగ్రత్త‌గా ఉంటారు. అయితే ఓ రోజున భార్య తాను ప్రెగ్నెంట్‌ అని చెప్పడంతో ప్రసాద్ షాక్ అవుతాడు.

తాను ఉపయోగించిన కండోమ్ నాణ్యతా లోపం వల్లే ఇలా జరిగిందని భావించి సదరు కంపెనీపై కోటి రూపాయల దావా వేస్తాడు ప్రసాద్. ఇంతకీ తండ్రిపై ప్రసాద్ కోపానికి కారణమేంటీ? కండోమ్ కంపెనీపై ప్రసాద్ ఎందుకు దావా వేశాడు? కోర్టులో టాప్ లాయర్ అజయ్ శర్మ (మురళీ శర్మ) వాదనలను ప్రసాద్ ఎలా ఎదుర్కొన్నాడా? కోటి రూపాయలు పరిహారాన్ని ప్రసాద్ పొందాడా? కండోమ్ వాడినా ప్రసాద్ భార్య ఎందుకు గర్బవతి అయిందనే ప్రశ్నలకు సమాధానమే జనక అయితే గనక సినిమా కథ.

జనక అయితే గనుక ఓటీటీ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. నవంబర్ 8 నుంచి జనక అయితే గనుక అందుబాటులోకి వస్తుందని, ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్లు 24 గంటల ముందే ఈ సినిమాను వీక్షించవచ్చని తెలిపింది. తాజాగా జనక అయితే గనక ఓటీటీ రిలీజ్‌కి సంబంధించి ఆహా ఓ టీజర్‌ను రిలీజ్ చేసింది. హీరో సుహాస్ స్వయంగా మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొనే కష్టాలను ఇందులో పంచుకున్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ ఫ్యామిలీ డ్రామాను మీరూ చూసేయండి.

More from Filmibeat

Read more about: janaka aithe ganaka ott news aha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X