నెల కాకుండానే OTTలోకి సుహాస్ రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్.. క్షణ క్షణం వణికించే దీన్ని ఎలా చూడాలంటే?
ఈ మధ్య కాలంలో అనేక అదిరిపోయే సినిమాలు ఓటీటీ వేదికగా త్వరగా వస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. చిన్నా, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా.. నెల కూడా కాకముందే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ఎవరి సినిమా అయినా సరే వెంటనే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇటీవలే వచ్చిన ఈ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ కూడా నెల తిరక్కముందే ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
యంగ్ హీరో సుహాస్.. ప్రధాన పాత్రలో వచ్చిన రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీయే ప్రసన్న వదనం. అరుణ్ వైకే దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మణికంట జేఎస్, ప్రసాద్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు. అలాగే ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించారు. ఇందులో రాశీ సింగ్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌లుగా చేశారు. అలాగే, ఈ సినిమాలో నితిన్ ప్రసన్న, కుశాలిని, సాయి శ్వేత, సత్య, వైవా హర్షలు కీలక పాత్రల్లో నటించారు.

ముఖ్యంగా ప్రసన్న వదనం సినిమా ఫేస్ బ్లైండ్‌నెస్ అనే సరికొత్త కాన్సెప్టుతో వచ్చింది. గతంలో ఎన్నడూ చూడని, వినని కథాంశం కావడంతో అంతా తెగ ఎగ్జైట్ అయ్యారు. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని.. అందులోనూ సహాస్ హీరోగా చేస్తున్నాడు కాబట్టి కచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందనుకున్నారు. అలా భారీ అంచనాల మధ్య మే 3వ తేదీన విడుదల అయిందీ సినిమా. మొదటి నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్న ఈ చిత్రంపై డిజిటల్ హక్కులపై పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది.
భారీ పోటీ నడుమ ఈ సినిమా హక్కును ఆహా సంస్థ దక్కించుకుంది. ఫ్యాన్సీ ధర చెల్లించి మరీ ఈ సినిమా హక్కులను పొందిన ఆహా.. తాజాగా ప్రసన్న వదనం సినిమా ఓటీటీ విడుదల తేదీని రిలీజ్ చేసింది. నెల రోజులు కూడా కాకముందే.. అంటే మే 24వ తేదీ నుంచి సుహాస్ హీరోగా చేసిన ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఆ విషయం తెలుసుకున్న అభిమానులు అంతా తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ఇప్పటి వరకు థియేటర్లలో చూడని వాళ్లు అయితే కచ్చితంగా ఓటీటీలో చూడాలని అనుకుంటున్నారు. మరి ఈ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని ఓటీటీ వేదికగా మే 24 నుంచి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











