నెల కాకుండానే ఓటీటీలోకి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. బీపీ పెంచేసే ఈ మూవీని ఎందులో చూడాలంటే!
మిగిలిన ఇండస్ట్రీల్లో మాదిరిగా తెలుగులో క్రైమ్ థ్రిల్లర్ మూవీలు పెద్దగా వచ్చేవి కాదు. కానీ, అలాంటి చిత్రాలకు ఆడియెన్స్ జై కొడుతుండడంతో ఈ మధ్య కాలంలో మాత్రం ఈ తరహా సినిమాలు భారీ స్థాయిలో రూపొందుతోన్నాయి. దీంతో వారానికో రెండు వారాలకో ఒక మూవీ అయినా వచ్చేస్తుంది. ఇలా ఇటీవలే విడుదలైన క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ మూవీనే 'ప్రసన్న వదనం'.
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుహాస్ నటించిన ప్రయోగాత్మక చిత్రమే 'ప్రసన్న వదనం'. అరుణ్ వైకే అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా ఫేస్ బ్లైండ్‌నెస్ అనే కాన్సెప్టుతో వచ్చింది. గతంలో ఎన్నడూ చూడని, వినని కథాంశం కావడంతో ఇది ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించి భారీ అంచనాలను ఏర్పరచుకుంది. అలా మే 3న ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

సుహాస్ హీరోగా నటించిన 'ప్రసన్న వదనం' సినిమాకు ప్రీమియర్స్ నుంచి డీసెంట్ టాక్ వచ్చింది. దీంతో ఆరంభంలోనే దీనికి మంచి రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం వారంలోనే రూ. 5 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని లాభాలను కూడా అందించింది. దీన్ని నిర్మాతలు కూడా కన్ఫార్మ్ చేసేశారు.
డిఫరెంట్ కాన్సెప్టుతో రూపొందిన 'ప్రసన్న వదనం' సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉండడంతో.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం తీవ్ర పోటీ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ రైట్స్‌ను ఆహా సంస్థ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో రివీల్ చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌పై అదిరిపోయే న్యూస్ వైరల్ అవుతోంది.

సుహాస్ నటించిన 'ప్రసన్న వదనం' సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని నెల కాకుండానే స్ట్రీమింగ్ చేయబోతున్నారట. అంటే మరికొద్ది రోజుల్లోనే ఇది అందుబాటులోకి రానుందని తెలిసింది. దీనిపై ఈ వారంలోనే ప్రకటన వస్తుందనే టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. 'ప్రసన్న వదనం' మూవీని మణికంట జేఎస్, ప్రసాద్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించారు. ఇందులో రాశీ సింగ్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌లుగా చేశారు. అలాగే, ఈ సినిమాలో నితిన్ ప్రసన్న, కుశాలిని, సాయి శ్వేత, సత్య, వైవా హర్షలు కీలక పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











