ఆ ఓటీటీలోనే మెంటలెక్కించే థ్రిల్లర్.. రిలీజ్ అయిన అన్ని రోజులకే వస్తుందా!

ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో థ్రిల్లర్ మూవీలు చాలా తక్కువగా వచ్చేవి. కానీ, ఇప్పుడు మాత్రం ప్రతి వారం కనీసం ఒక సినిమా అయినా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇలా వచ్చిన వాటిలో చాలా వరకూ విజయాలను సొంతం చేసుకుంటుండడంతో ఫిల్మ్ మేకర్లు మరిన్ని చిత్రాలు తీస్తున్నారు. అలా ఇప్పుడు ఆడియెన్స్‌ను అలరించేందుకు వచ్చిందే 'ప్రసన్న వదనం'.

టాలెంటెడ్ గాయ్ సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'ప్రసన్న వదనం'. అరుణ్ వైకే అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా ఫేస్ బ్లైండ్‌నెస్ అనే కాన్సెప్టుతో తెరకెక్కింది. గతంలో ఎన్నడూ చూడని, వినని అంశం కావడంతో ఇది ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించి భారీ అంచనాలను ఏర్పరచుకుంది. ఫలితంగా నేడే (మే 3) ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

Suhas Starrer Prasanna Vadanam Movie Digital Streaming Details

సుహాస్ హీరోగా చేసిన 'ప్రసన్న వదనం' సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి గత రాత్రి ప్రదర్శించిన ప్రీమియర్స్ నుంచి డీసెంట్ టాక్ వచ్చింది. మరి ఇదే కంటిన్యూ అవుతుందో లేదో ఆసక్తికరంగా మారింది. బుకింగ్స్ మాత్రం అదిరిపోయేలా ఉన్నాయి. ఫలితంగా ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్‌ను అందుకునే అవకాశం కనిపిస్తోంది.

'ప్రసన్న వదనం' సినిమా సందడి ఇప్పటికే థియేటర్లలో రన్ అవుతుండగా.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు తాజాగా రివీల్ అయ్యాయి. దీని ప్రకారం.. ఈ సినిమాను తీవ్ర పోటీ నడుమ ఆహా సంస్థ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో రివీల్ చేశారు. ఇక, ఈ హక్కుల కోసం సదరు సంస్థ చిత్ర నిర్మాతలకు భారీ మొత్తాన్ని చెల్లించినట్లు తెలుస్తోంది.

నేచురల్ యాక్టర్ సుహాస్ నటించిన 'ప్రసన్న వదనం' సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా ఆహా సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని కూడా ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. అంటే మే 3వ తేదీన విడుదలైన ఈ చిత్రం జూన్ మొదటి వారంలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు.

ఇదిలా ఉండగా.. 'ప్రసన్న వదనం' మూవీని మణికంట జేఎస్, ప్రసాద్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించారు. ఇందులో రాశీ సింగ్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌లుగా చేశారు. అలాగే, ఈ సినిమాలో నితిన్ ప్రసన్న, కుశాలిని, సాయి శ్వేత, సత్య, వైవా హర్షలు కీలక పాత్రలను పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X