ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. వాళ్లకు మాత్రమే స్ట్రీమింగ్
క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అంటే ఒకప్పుడు పెద్దగా ఆదరణ లభించేది కాదు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం అలాంటి సినిమాలే మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుతున్నాయి. ఫలితంగా భారీ సక్సెస్‌లను సొంతం చేసుకుంటున్నాయి. దీంతో తెలుగు కూడా ఈ తరహా మూవీలు భారీగా వస్తున్నాయి. ఇలా ఇటీవల విడుదల అయిన చిత్రమే 'ప్రసన్న వదనం'.
టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సుహాస్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీనే 'ప్రసన్న వదనం'. అరుణ్ వైకే అనే దర్శకుడు రూపొందించిన ఈ సినిమా ఫేస్ బ్లైండ్‌నెస్ అనే కాన్సెప్టుతో వచ్చింది. గతంలో ఎన్నడూ చూడని, వినని స్టోరీలైన్ కావడంతో ఇది ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించి భారీ అంచనాలను ఏర్పరచుకుంది. అలా మే 3న ఎంతో గ్రాండ్‌గా విడుదల అయింది.

సుహాస్ హీరోగా చేసిన 'ప్రసన్న వదనం' సినిమాకు ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఆరంభంలోనే దీనికి మంచి స్పందన లభించింది. ఫలితంగా ఈ చిత్రం వారంలోనే రూ. 5 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని లాభాలను కూడా సొంతం చేసుకుంది. ఫలితంగా సుహాస్ ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది.
విభిన్నమైన కథతో రూపొందిన సుహాస్ 'ప్రసన్న వదనం' సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉండడంతో.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం తీవ్ర పోటీ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ రైట్స్‌ను ఆహా సంస్థ కొనుగోలు చేసింది. దీంతో ఇది థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుందని మొదట ప్రచారం కూడా జరిగింది.

సుహాస్ నటించిన 'ప్రసన్న వదనం' సినిమాను అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి తీసుకు వస్తున్నట్లు ఆహా ఇటీవలే ప్రకటించింది. అందుకు తగ్గట్లుగానే మే 24 నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పింది. కానీ, ఒకరోజు ముందుగానే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. అయితే, ఇది ఆహా గోల్డ్ యూజర్లకు మాత్రమే లభిస్తుంది. మిగిలిన వాళ్లు మాత్రం రేపటి నుంచి చూసే అవకాశం ఉంటుంది.
ఇదిలా ఉండగా.. 'ప్రసన్న వదనం' మూవీని మణికంట జేఎస్, ప్రసాద్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించారు. ఇందులో రాశీ సింగ్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌లుగా చేశారు. అలాగే, ఈ సినిమాలో నితిన్ ప్రసన్న, కుశాలిని, సాయి శ్వేత, సత్య, వైవా హర్షలు కీలక పాత్రలను పోషించారు.


Click it and Unblock the Notifications











