ఓటీటీలో చరిత్ర సృష్టించిన సుహాస్.. టాలీవుడ్‌లో తొలి సినిమాగా సంచలన రికార్డు
ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది థియేటర్ల కంటే వీటికే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో అన్ని ప్లాట్‌ఫాంలు ప్రతి వారంలోనూ ఎన్నో సినిమాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు ఓటీటీ సంస్థ ఆహా కొత్త కంటెంట్‌తో ముందుకు వస్తోంది. అలా ఇటీవలే 'ప్రసన్న వదనం' అనే మూవీని తీసుకు వచ్చింది.
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుహాస్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీనే 'ప్రసన్న వదనం'. అరుణ్ వైకే తెరకెక్కించిన ఈ సినిమా ఫేస్ బ్లైండ్‌నెస్ (ముఖాలు గుర్తుపట్టలేని సమస్య) అనే కాన్సెప్టుతో వచ్చింది. దీంతో ఇది ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించి భారీ అంచనాలను ఏర్పరచుకుంది. అలా మే 3న ఎంతో గ్రాండ్‌గా ఆడియెన్స్ ముందుకు వచ్చేసింది.

విభిన్నమైన స్టోరీలైన్‌తో రూపొందిన 'ప్రసన్న వదనం' సినిమాకు ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఆరంభంలోనే దీనికి మంచి స్పందన లభించింది. ఫలితంగా ఈ చిత్రం చాలా తక్కువ సమయంలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని లాభాలను కూడా సొంతం చేసుకుంది. ఫలితంగా సుహాస్ ఖాతాలో మరో విజయం కూడా వచ్చి చేరింది.
అరుణ్ వైకే దర్శకత్వంలో సుహాస్ హీరోగా నటించిన 'ప్రసన్న వదనం' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా సంస్థ కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి తీసుకు వస్తున్నట్లు సదరు సంస్థ ఇటీవలే ప్రకటించింది. అందుకు తగ్గట్లుగానే మే 24 నుంచి ఈ సినిమాకు స్ట్రీమింగ్ చేస్తోన్న విషయం తెలిసిందే.

ఆహాలో 'ప్రసన్న వదనం' మూవీకి అదిరిపోయే స్పందన లభిస్తోంది. ఫలితంగా ఈ చిత్రం తాజాగా 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను పూర్తి చేసుకుంది. తద్వారా వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న చిత్రంగా ఇది రికార్డు సాధించింది. ఈ విషయాన్ని ఆహా సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఇదే ఊపు కొనసాగితే ఈ చిత్రం వేగంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను కూడా వేగంగా చేరే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. 'ప్రసన్న వదనం' మూవీని మణికంట జేఎస్, ప్రసాద్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించారు. ఇందులో రాశీ సింగ్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌లుగా చేశారు. అలాగే, ఈ సినిమాలో నితిన్ ప్రసన్న, కుశాలిని, సాయి శ్వేత, సత్య, వైవా హర్షల్లో నటించారు.


Click it and Unblock the Notifications











