Writer Padmabhushan: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సుహాస్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

మొదట స్టార్ హీరోల సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ లో కనిపించిన సుహాస్ తర్వాత మెల్లగా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించడం మొదలుపెట్టాడు. ఇక అతనికి కలర్ ఫోటో సినిమా మంచి గుర్తింపును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదలయి అతని రేంజ్ ఒక్కసారిగా పెంచింది. ఇక హీరోగా సుహాస్ కు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.

ఇక వీలైనంతవరకు మంచి కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకోవాలి అని అతను ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాగే హిట్ 2లో కూడా ఎవరు ఊహించని విధంగా విలన్ పాత్రలో నటించి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఫిబ్రవరి లో విడుదలైన రైటర్ పద్మభూషణ్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. హీరోగా మొదటిసారి సుహాస్ బాక్సాఫీస్ వద్ద ఒక సాలిడ్ సక్సెస్ అయితే అందుకున్నాడు.

Suhas writer Padmabhushan official OTT movie release date

ఈ సినిమా ఊహించని విధంగా పెట్టిన పెట్టుబడికి మంచి ప్రాఫిట్స్ అందించింది. అయితే రైటర్ పద్మభూషణ్ సినిమాను ఓటీటీ లో ఎప్పుడు విడుదల చేస్తారా అని ఓవర్గం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అసలైతే ఉగాది పండగ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు అంతకంటే ముందుగానే ఓటీటీ లో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను జి 5 సొంతం చేసుకుంది.

ఇక మార్చి 17వ తేదీన నుంచి రైటర్ పద్మభూషణ్ సినిమా ఓటీటీ లో సందడి చేయబోతోంది. ఇక ఈ సినిమా రొమాంటిక్ కామెడీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మంచి ఎమోషనల్ పాయింట్ తో సినిమా ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మరి ఓటీటీ లో రైటర్ పద్మభూషణ్సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. రైటర్ పద్మభూషణ్ సినిమాలో రోహిని ఆశిష్ విద్యార్థి, గోపరాజు రమణ, శ్రీ గౌరీ ప్రియ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించగా టీనా శిల్పరాజ్ కథానాయికగా నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X