Mem Famous OTT: ఓటీటీలోకి వచ్చేసిన మేమ్ ఫేమస్.. ఆ సీన్స్ కూడా యాడ్ చేసి!
ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి యూత్‌ఫుల్ కామెడీ మూవీలు చాలానే వచ్చేవి. వాటికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా భారీ స్థాయిలోనే లభించేది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం ఆ తరహా చిత్రాలు పెద్దగా ప్రేక్షకుల ముందుకు రాలేదు. దీంతో అలాంటి జోనర్లను ఇష్టపడే వాళ్లంతా నిరాశలో ఉండిపోయారు. ఈ పరిస్థితుల్లోనే కొద్ది రోజుల క్రితమే వచ్చింది 'మేమ్ ఫేమస్' మూవీ. యంగ్ టాలెంటెడ్ గాయ్ సుమంత్ ప్రభాస్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి ప్రమోషన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.
ఫుల్ లెంగ్త్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'మేమ్ ఫేమస్' మూవీపై ఆరంభం నుంచే ఉన్న అంచనాలకు అనుగుణంగా మంచి టాక్ వచ్చింది. అదే సమయంలో దీనికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని క్లీన్ హిట్‌గా నిలిచింది. ఫుల్ రన్‌లో మరింత ఎక్కువగా లాభాలను సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. ఇలా దాదాపు నెల రోజుల పాటు ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా 'మేమ్ ఫేమస్' ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

సుమంత్ ప్రభాస్ హీరోగా, దర్శకుడిగా చేసిన 'మేమ్ ఫేమస్' మూవీపై నెలకొన్న అంచనాల వల్ల.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌కు మంచి పోటీ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ హక్కులను మంచి రేటుకు కొనుగోలు చేసింది. అయితే, థియేటర్లలో మే 26న విడుదలైన ఈ మూవీని త్వరగానే స్ట్రీమింగ్‌కు తెస్తారని అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా నెల రోజుల తర్వాతనే అంటే ఈరోజు నుంచే అమెజాన్ స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చేసింది. ఇందులో సెన్సార్ అయిన సీన్లను కూడా యాడ్ చేసినట్లు తెలిసింది.
సుమంత్ ప్రభాస్ 'మేమ్ ఫేమస్' మూవీలో మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, అంజి తదితరులు కీలక పాత్రలను పోషించిన ఈ సినిమాను చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్‌లు నిర్మించారు. దీనికి కల్యాణ్ మాణిక్ సంగీతం ఇచ్చారు.


Click it and Unblock the Notifications











