ఓటీటీలోకి కడుపుబ్బా నవ్వించే కామెడీ సినిమా.. ఎందులో చూడాలంటే!
టాలీవుడ్‌లోని చాలా మంది కమెడియన్లు ఈ మధ్య కాలంలో హీరోలుగా మారుతున్నారు. అందులో కొందరు అదిరిపోయే కంటెంట్‌తో వచ్చి హీరోలుగానూ విజయాలను అందుకుంటున్నారు. వీళ్లను ఆదర్శంగా తీసుకుని మరికొంత మంది ముందుకు వస్తున్నారు. అలా ఇటీవలే హీరోగా పరిచయమైన వారిలో హర్ష చెముడు ఒకడు. 'సుందరం మాస్టర్' మూవీతో అతడు వచ్చాడు.
హర్ష చెముడు హీరోగా పరిచయం అయిన సినిమానే 'సుందరం మాస్టర్'. కల్యాణ్ సంతోష్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మాస్ మహారాజా రవితేజ నిర్మించడంతో ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికితోడు డిఫరెంట్ ప్రమోషన్ చేయడంతో అంచనాలను ఏర్పరచుకుంది. ఇలా ఎంతో హైప్‌తో 'సుందరం మాస్టర్' మూవీ ఫిబ్రవరి 23న విడుదల అయింది.

ఎన్నో అంచనాల విడుదలైన 'సుందరం మాస్టర్' మూవీకి ప్రీమియర్స్ నుంచే డీసెంట్ టాక్ వచ్చింది. కానీ, ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ఫలితంగా హర్ష నటించిన ఈ చిత్రం ఓపెనింగ్స్‌తో పాటు ఆ తర్వాత కూడా కలెక్షన్లను అంతగా రాబట్టలేదు. తద్వారా ఈ సినిమా సగానికి సగం నష్టాలతో పరాజయాన్ని చవి చూసింది.
హర్ష చెముడు - కల్యాణ్ సంతోష్ కాంబినేషన్‌లో రూపొందిన 'సుందరం మాస్టర్' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఫేమస్ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం సదరు సంస్థ మంచి రేటునే ముట్టజెప్పినట్లు ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపించింది. ఇక, ఇప్పుడు ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌పై క్లారిటీ వచ్చేసింది.

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'సుందరం మాస్టర్' మూవీని అనుకున్న దానికంటే ముందు దీన్ని స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఈ మూవీని మార్చి 22వ తేదీ నుంచే ఈటీవీ విన్ సంస్థ అందుబాటులోకి తీసుకు రాబోతుంది. దీంతో థియేటర్లలో మిస్ అయిన వాళ్లంతా ఈ సినిమాను ఎంచక్కా ఓటీటీలో చూసేయొచ్చు.
ఇదిలా ఉండగా.. హర్ష చెముడు హీరోగా నటించిన 'సుందరం మాస్టర్' మూవీలో దివ్య శ్రీపాద హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాను ఆర్టీ టీమ్ వర్క్స్, గోల్ డెన్ మీడియా బ్యానర్లపై రవితేజ, సుధీర్ కుమార్ నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల దీనికి సంగీతాన్ని అందించారు. ఇందులో హర్షవర్ధన్, భద్రం, చైతన్య, బాలకృష్ణ తదితరులు కీలక పాత్రలు చేశారు.


Click it and Unblock the Notifications











