ఓటీటీలోకి పొట్టచెక్కలయ్యేలా నవ్వించే సినిమా.. మిస్ అయ్యారో అంతే!
మిగిలిన జోనర్లతో పోల్చుకుంటే కామెడీ ప్రధానంగా రూపొందిన మూవీలకు భారీ స్థాయిలో స్పందన వస్తుంటుంది. ముఖ్యంగా ఇలాంటి సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు యూత్ కూడా బాగా ఆదరిస్తుంటారు. దీంతో కమెడియన్లు సైతం హీరోలుగా మారి సినిమాలు చేస్తున్నారు. అలా ఇటీవలే ప్రముఖ హాస్య నటుడు హర్ష చెముడు 'సుందరం మాస్టర్' అనే మూవీతో వచ్చాడు.
కమెడియన్ హర్ష చెముడు హీరోగా అవతారం ఎత్తిన సినిమానే 'సుందరం మాస్టర్'. కల్యాణ్ సంతోష్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మాస్ మహారాజా రవితేజ నిర్మించడంతో ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికితోడు డిఫరెంట్ ప్రమోషన్ చేయడంతో అంచనాలను పెంచుకుంది. ఇలా 'సుందరం మాస్టర్' మూవీ ఫిబ్రవరి 23వ తేదీన ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది.

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సుందరం మాస్టర్' మూవీకి డీసెంట్ టాక్ వచ్చింది. అయినా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం అంతగా రాలేదు. ఫలితంగా హర్ష నటించిన ఈ మూవీకి ఓపెనింగ్స్ పెద్దగా రాలేదు. ఆ తర్వాత కూడా కలెక్షన్లను అంతగా వసూలు చేయలేదు. తద్వారా ఈ సినిమా చాలా నష్టాలను చవి చూడాల్సి వచ్చింది.
హర్ష చెముడు - కల్యాణ్ సంతోష్ కలిసి చేసిన 'సుందరం మాస్టర్' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఫేమస్ ఓటీటీ సంస్థలు, ఈటీవీ విన్, ఆహా దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం సదరు సంస్థలు మంచి రేటునే నిర్మాతలకు అందించినట్లు ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపించింది. ఇక, ఇప్పుడు ఈ మూవీ స్ట్రీమింగ్‌పై ఆహా ప్రకటన వదిలింది.

పూర్తి స్థాయి వినోదాత్మక కథతో రూపొందిన 'సుందరం మాస్టర్' మూవీని మార్చి 28వ తేదీ నుంచే ఆహా సంస్థ అందుబాటులోకి తీసుకు రాబోతుంది. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అంతేకాదు, 'మాస్టర్ హోమ్ ట్యూషన్స్ చెప్పడానికి మన ఇంటికి వచ్చేస్తున్నాడు రెడీగా ఉండండి' అంటూ చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉండగా.. హర్ష చెముడు హీరోగా మారి నటించిన 'సుందరం మాస్టర్' సినిమాలో దివ్య శ్రీపాద హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని ఆర్టీ టీమ్ వర్క్స్, గోల్ డెన్ మీడియా బ్యానర్లపై రవితేజ, సుధీర్ కుమార్ ప్రొడ్యూస్ చేశారు. శ్రీ చరణ్ పాకాల ఈ మూవీకి సంగీతాన్ని అందించారు. ఇందులో హర్షవర్ధన్, భద్రం, చైతన్య, బాలకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











