ఓటీటీలోకి వచ్చేసిన అదిరిపోయే కామెడీ మూవీ.. కడుపుబ్బా నవ్వాలంటే ఇది చూడాల్సిందే!
గతంలో కంటే ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో కామెడీ నేపథ్యంతో సాగే సినిమాలు చాలా ఎక్కువగా వస్తున్న విషయం తెలిసిందే. వీటికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కూడా భారీ స్థాయిలోనే వస్తోంది. దీంతో కమెడియన్లు సైతం హీరోలుగా మారి ఎన్నో మూవీలు చేస్తున్నారు. ఇలా ఇటీవలే ఆడియెన్స్‌ను అలరించేందుకు వచ్చిన సినిమానే 'సుందరం మాస్టర్'.
ఫేమస్ కమెడియన్ హర్ష చెముడు హీరోగా నటించిన సినిమానే 'సుందరం మాస్టర్'. కల్యాణ్ సంతోష్ రూపొందించిన ఈ కామెడీ మూవీని మాస్ మహారాజా రవితేజ నిర్మించడంతో ఇది ఆరంభంలోనే హైలైట్ అయింది. దీనికితోడు డిఫరెంట్ ప్రమోషన్ చేయడంతో అంచనాలను ఏర్పరచుకుని.. ఈ మూవీ ఫిబ్రవరి 23వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయిపోయింది.

మంచి హైప్‌తో విడుదలైన 'సుందరం మాస్టర్' మూవీకి ఆరంభంలో డీసెంట్ టాక్ వచ్చింది. అయినా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం అనుకున్న విధంగా దక్కలేదు. ఫలితంగా హర్ష నటించిన ఈ మూవీకి ఓపెనింగ్స్ పెద్దగా రాలేదు. ఆ తర్వాత కూడా ఆడియెన్స్‌ను ఈ చిత్రం థియేటర్లకు రప్పించలేకపోయింది. ఫలితంగా నష్టాలతోనే రన్ ముగించింది.
హర్ష చెముడు హీరోగా కల్యాణ్ సంతోష్ తీసిన 'సుందరం మాస్టర్' మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఫేమస్ ఓటీటీ సంస్థలు ఈటీవీ విన్, ఆహా దక్కించుకున్నాయని ముందే చెప్పుకున్నాం. అయితే, ఈ సినిమా స్ట్రీమింగ్‌పై మాత్రం రకరకాల ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే ఆహా సంస్థ 'సుందరం మాస్టర్' స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది.
ఫుల్ లెంగ్త్ కామెడీతో రూపొందిన 'సుందరం మాస్టర్' మూవీని ముందుగా ప్రకటించినట్లుగానే గత అర్ధరాత్రి (మార్చి 28వ తేదీ) నుంచే ఆహా సంస్థ స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చేసింది. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అంతేకాదు, 'మాష్టారు.. మాష్టారు.. మీ మనసులు గెలవటానికి వచ్చేసారు' అంటూ ఓ పోస్టును కూడా చేసింది.

ఇదిలా ఉండగా.. హర్ష చెముడు - కల్యాణ్ సంతోష్ కాంబోలో రూపొందిన 'సుందరం మాస్టర్' సినిమాలో దివ్య శ్రీపాద హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రాన్ని ఆర్టీ టీమ్ వర్క్స్, గోల్ డెన్ మీడియా బ్యానర్లపై రవితేజ, సుధీర్ కుమార్ ప్రొడ్యూస్ చేశారు. శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో హర్షవర్ధన్, భద్రం, చైతన్య, బాలకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











