Ooru Peru Bhairavakona OTT: నెల కాకుండానే ఓటీటీలోకి హర్రర్ థ్రిల్లర్.. ఎప్పటి నుంచి చూడొచ్చంటే?

ఈ మధ్య కాలంలో అనేక సినిమాలు నెల తిరక్కముందే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. పెద్ద, చిన్న అనే తేడా లేకుండా త్వరగా వచ్చేస్తూ సినీ ప్రియులను అలరిస్తున్నాయి. అత తక్కువ సినిమాలు మాత్రమే ఆలస్యంగా ఓటీటీలోకి వస్తుండగా.. ఎక్కువ శాతం నెల లోపే వచ్చేస్తున్నాయి. అయితే తాజాగా సందీప్ కిషన్ హీరోగా వచ్చిన హర్రర్ థ్రిల్లర్ మూవీ ఊరుపేరు భైరవ కోన ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నెల కూడా కాకముందే వస్తున్న ఈ సినిమాను ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

యంగ్ అండ్ డైనమిక్ హీరోగా కొసాగుతున్న సందీప్ కిషన్ కథానాయకుడిగా.. వీఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రమే ఊరు పేరు భైరవకోన. హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ సినిమాకు విడుదలకు ముందే విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. ఇలా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో... చాలా మందే ఈ సినిమాను చూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా హిట్ దిశగా దూసుకు వెళ్తుంది.

Sundeep Kishan Horror Thriller Movie Ooru Peru Bhairavakona OTT Streaming Details Here

ఇదంతా ఇలా ఉండగా.. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ, అనిల్ సుంకర నిర్మించారు. ఇందులో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా చేశారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఇచ్చాడు. వెన్నెల కిశోర్, హర్ష, రవి శంకర్ కీలక పాత్రల్లో నటించారు. విభిన్నమైన సబ్జెక్టుతో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ వేధికగా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకుంది. భారీ ధరకే ఈ సినిమా హక్కలను దక్కించుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ముందుగా సినిమా థియేటర్లలో వచ్చిన 45 రోజుల తర్వాతే విడుదల చేయాలని భావించినప్పటికీ.. ఇంకా ముందుగానే తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారుట.

Sundeep Kishan Horror Thriller Movie Ooru Peru Bhairavakona OTT Streaming Details Here

మార్చి 3వ వారం వచ్చే తొలి శుక్రవారం రోజు ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారట. అంటే మార్చి 15వ తేదీ అన్నమాట. ఫిబ్రవరి 16వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఊరుపేరు భైరవకోన చిత్రం నెల రోజులకు ఒక్క రోజు ముందుగానే ఓటీటీలో సందడి చేయనుంది. చూడాలి మరి ఇదే రోజు సినిమాను విడుదల చేసి అందరికీ సర్ ప్రైజ్ ఇస్తారా లేక లేటుగా వచ్చి నిరాశ పరుస్తారా అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X