6 ఏళ్ల తర్వాత OTTలోకి సందీప్ కిషన్ సైంటిఫిక్ థ్రిల్లర్.. ఫుల్ థ్రిల్ ఇచ్చే దీన్ని ఎక్కడ చూడాలంటే?
ఓటీటీల హవా పెరుగుతున్నా కొద్దీ.. పాత చిత్రాలను సైతం ఓటీటీల్లోకి తీసుకు వస్తూ క్యాష్ చేసుకుంటున్నారు చాలా మంది దర్శక, నిర్మాతలు. ముఖ్యంగా తమ చిత్రం బాగుందని భావించినా.. వెంటనే వాటిని ఓటీటీల్లోకి తీసుకు వస్తూ తెగ సందడి చేస్తున్నారు. ఆ సినిమా వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా సరే అన్ని భాషల వాళ్లకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ఓటీటీలోకి ఓ క్రేజీ మూవీ రాబోతుంది. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఓటీటీలో రాబోతుంది. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠిలు జంటగా ఆరేళ్ల క్రితం చేసిన సినిమానే మాయావన్. అయితే తమిళ భాషలో 2017లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. దీంతో ప్రాజెక్టు జెడ్ పేరుతో ఇదే చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేశారు. కానీ ఆశించిన స్థాయిలో హిట్ కొట్టలేకపోయింది. పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కేవలం తమిళ, తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. అయితే కొన్నాళ్ల క్రితం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా తమిళంతో పాటు హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేశారు.

కానీ తెలుగు భాషలో మాత్రం ఈ సినిమా ఓటీటీ వేదికగా అందుబాటులో లేదు. అయితే ఆ విషయాన్ని అర్థం చేసున్న ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ క్రేజీ సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రాన్ని 6 సంవత్సరాల తర్వాత తెలుగులో అందుబాటులోకి తేబోతుంది. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠిలు జంటగా చేసిన ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, డేనియల్ బాలాజీ, మైమ్ గోపి, ఆర్. అమరేంద్రన్, భగవతి పెరుమాళ్, జయప్రకాష్ సహాయక పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ అద్భుతమైన సినిమాకు జిబ్రాన్ సంగీతం అందించగా.. గోపి అమర్ నాథ్ సినిమాటోగ్రాఫర్ గా, లియో జాన్ పాల్ ఎడిటర్ గా వ్యవహరించారు.

C. V. కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2017 డిసెంబర్ 14వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ప్రాజెక్ట్ జెడ్ పేరుతో తెలుగులోకి రాగా.. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహా వేదికగా ఈ క్రేజీ మూవీని మే 31వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నేరుగా ఆహానే ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈ విషయం తెలుసుకున్న ఓటీటీ ప్రియులు అంతా ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. ముఖ్యంగా థ్రిల్లర్ చిత్రాలను ఇష్ట పడే వాళ్లంతా కచ్చితంగా ఈ సినిమా చూడాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ సూపర్ హిట్ మూవీని మీరు కూడా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











