Mazaka OTT : ఓటీటీలోకి సందీప్ కిషన్ మజాకా.. ఎక్కడ చూడాలంటే?

ప్రేక్షకులను అలరించేందుకు టాలీవుడ్ నుంచి ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ వస్తూనే ఉన్నాయి. ఇక థియేటర్లలో భారీ చిత్రాల సందడే కాకుండా.. ఓటీటీలోనూ వచ్చే సినిమాలు కూడా దుమ్ములేపుతున్నాయి. మంచి వ్యూయర్ షిప్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆయా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో అక్కినేని నాగచైతన్య 'తండేల్', విక్టరీ వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం', బాలకృష్ణ 'డాకూ మహారాజ్' వంటి చిత్రాలు విడుదలై ఓటీటీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.

కాగా, తాజాగా మరో ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ చిత్రాల జాబితాలోకి చేరిపోయింది. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రీతూ వర్మ జంటగా నటించిన రీసెంట్ ఫిల్మ్ 'మజాకా'. ఈ చిత్రానికి త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీ జోనర్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 26న థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి కాస్తా మంచి రివ్యూనే అందుకుందీ చిత్రం. ఇక థియేట్రికల్ రన్ పూర్తి కావడంతో ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది.

Sundeep Kishan Mazaka Movie Streaming in OTT Now

అంతే కాదు మార్చి 28 నుంచి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కూడా అవుతుండటం విశేషం. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. ఈ చిత్రం రిలీజ్ తర్వాత జీ5 డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. ప్రస్తుతం ఓటీటీలో మాత్రం ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కుతుండటం విశేషం. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం కేవలం రూ.9 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిందని ట్రేడ్ లెక్కలు తెలుపుతున్నాయి. జీ5లోనే విక్టరీ వెంకటేశ్ సంక్రాంతి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక మజాకా చిత్రంలో సందీప్ కిషన్, రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్ సీనియర్ నటుడు రావు రమేష్ వెంకట రమణ అనే పాత్రతో అలరించారు. కింగ్, అక్కినేని నాగార్జున 'మన్మథుడు' హీరోయిన్ అన్షు అంబానీ కీలక పాత్ర పోషించింది. దశాబ్దం తర్వాత మళ్లీ టాలీవుడ్ కు ఈ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. రావు రమేష్ కు జోడీ పాత్రలో నటించి మెప్పించింది. మురళీ శర్మ, జబర్దస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆది, శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్ర, రఘు బాబు, ఛత్రపతి విలన్ సుప్రిత్ రెడ్డి కీలక పాత్రలతో అలరించారు.

సందీప్ కిషన్ 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటున్నారు. 'ప్రస్థానం'తో హీరోగా పరిచయం అయిన సందీప్ కిషన్, ఇప్పటి వరకు 20 సినిమాల్లో నటించారు. గుండెల్లో గోదారి, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, బీరువా, నక్షత్రం, గల్లీ రౌడీ, మేఖేల్ వంటి చిత్రాల్లో హీరోగా మెప్పించారు. మరోవైపు 'కెప్టెన్ మిల్లర్', 'రాయన్' చిత్రాల్లో కీలక పాత్రలతో అలరించారు. ఇక ప్రస్తుతం 'వైబ్' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక రీతూ వర్మ 'ధృవ నక్షత్రం' అనే చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

More from Filmibeat

Read more about: sundeep kishan mazaka ott movies
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X